For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైవ్‌లో భార్యకు ఐలవ్యూ చెప్పిన బాలయ్య: ఆయనే కాళ్లు పట్టుకున్నాడు అంటూ.. ఆమె రియాక్షన్ చూస్తే!

  |

  పది కాదు.. ఇరవై కాదు.. దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఆయన ఎన్నో పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు. ఇక, ఇప్పుడు కూడా ఆయన ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బాలయ్య ఓ టాక్‌ షోకు హోస్టుగానూ మారారు. ఆహా సంస్థ కోసం ఆయన Unstoppable with NBK Show అనే షోను చేస్తున్నారు. ఇందులో తనదైన హోస్టింగ్‌తో అలరిస్తోన్న బాలయ్య.. అప్పుడే దీన్ని సూపర్ డూపర్ హిట్ చేసేశారు. ఈ క్రమంలోనే వచ్చే ఎపిసోడ్‌లో రానాతో సందడి చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య తన భార్యకు ప్రపోజ్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

  ‘అఖండ’తో హిట్ ట్రాక్ ఎక్కారు

  ‘అఖండ’తో హిట్ ట్రాక్ ఎక్కారు

  నందమూరి బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమే 'అఖండ'. ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్‌ ఇందులో హీరోయిన్‌. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాతో బాలయ్య హిట్ ట్రాక్ ఎక్కారు.

  హైపర్ ఆది పెళ్లిపై నోరు జారిన తండ్రి: అమ్మాయిని చూసేశాం కానీ.. విష్ణుప్రియను లాగుతూ సంచలన వ్యాఖ్యలు

  టాక్ షోతో హోస్టుగా మారిన హీరో

  టాక్ షోతో హోస్టుగా మారిన హీరో

  అరవై ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా కనిపించే నందమూరి బాలకృష్ణ.. అరవై ఏళ్ల ఏజ్‌లోనూ ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి వచ్చారు. ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ నెలలో ఈ టాక్ షోను గ్రాండ్‌గా మొదలు పెట్టారు.

  7 ఎపిసోడ్స్... ఎవరెవరు వచ్చారు

  7 ఎపిసోడ్స్... ఎవరెవరు వచ్చారు

  బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK' షో నుంచి ఇప్పటి వరకూ ఏడు ఎపిసోడ్స్ వచ్చాయి. మొదటి దాంట్లో మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో దానిలో హీరో నాని, మూడో ఎపిసోడ్‌లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, నాలుగో దానిలో అఖండ యూనిట్, ఐదో దానికి రాజమౌళి, కీరవాణి, ఆరో దానికి పుష్ప టీమ్, ఏడో దానికి రవితేజ, గోపీచంద్ మలినేని వచ్చారు.

  అరాచకమైన ఫొటోలను వదిలిన యాంకర్ వర్షిణి: తొలిసారి ఇంత హాట్‌గా.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  బాలయ్య రచ్చ.. అన్నీ సక్సెస్‌గా

  బాలయ్య రచ్చ.. అన్నీ సక్సెస్‌గా


  సుదీర్ఘమైన కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ ఏ షోనూ హోస్ట్ చేయలేదు. కానీ, 'Unstoppable with NBK' షోకు మాత్రం ఆయన అదిరిపోయే హోస్టింగ్ చేస్తున్నారు. తొలి ప్రయత్నమే అయినా వచ్చిన గెస్టులతో పాటు ప్రేక్షకులను అలరించేలా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ వచ్చిన ఏడు ఎపిసోడ్స్ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో షో కూడా సక్సెస్ అయింది.

  రానాతో కలిసి బాలయ్య సందడి

  రానాతో కలిసి బాలయ్య సందడి

  'Unstoppable with NBK' షోలో భాగంగా ఎనిమిదో ఎపిసోడ్ కోసం టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా గెస్టుగా వచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇటీవలే బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇది జనవరి 7న స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందులో రానాతో కలిసి బాలయ్య తెగ సందడి చేసినట్లు అర్థం అవుతోంది.

  Shriya Saran: స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో శ్రీయ రొమాన్స్.. నైట్ టైమ్‌లో రెచ్చిపోయి మరీ దారుణంగా!

  భార్యకు ఐలవ్యూ చెప్పిన బాలయ్య

  'Unstoppable with NBK' షో ఎనిమిదో ఎపిసోడ్‌ కోసం వచ్చిన దగ్గుబాటి రానాతో బాలకృష్ణ ఓ ఆట ఆడుకున్నారు. ఇందులో భాగంగానే ఈ యంగ్ హీరో లవ్ ట్రాకులు, పెళ్లిపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో రానా తెగ సిగ్గు పడి, ఆ తర్వాత కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం బాలయ్యకు రానా టాస్క్ ఇచ్చాడు. దీంతో ఆయన తన భార్యకు ప్రపోజ్ చేశారు.

  Recommended Video

  Akhanda Success Tour : Nandamuri Balakrishna, Boyapati Srinu హల్చల్
  ఆయనే కాళ్లు పట్టుకున్నాడంటూ

  ఆయనే కాళ్లు పట్టుకున్నాడంటూ

  ఈ షోలో భాగంగా రానా అడగ్గానే బాలయ్య తన భార్య వసుంధర దేవికి ఫోన్ చేశారు. అలా మాట్లాడుతోన్న సమయంలో ఆమెకు ఐలవ్యూ అని చెప్పేశారు. దీనికి వసుంధర దేవి 'మీరు ప్రేమిస్తున్నారన్న విషయం నాకు తెలుసు' అని రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత 'దేనికైనా నేనే సారి చెబుతా. శ్రీకృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు నేనెంత' అని బాలయ్య చెప్పుకొచ్చారు.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Unstoppable with NBK Show For Aha. Balakrishna Propose to His Wife in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X