»   » పూరీ జగన్నాధ్, బాలకృష్ణ చిత్రం లాంచింగ్ డేట్

పూరీ జగన్నాధ్, బాలకృష్ణ చిత్రం లాంచింగ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాధ్ డైరక్షన్ లో రూపొందే చిత్రం మే ఇరవైన లాంచ్ కానుందని సమాచారం. ఇంతకుముందు బాలయ్య హీరోగా 'చెన్నకేశవ రెడ్డి', 'లక్ష్మీనరసింహా' చిత్రాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ తిరిగి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేష్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. బాలయ్యబాబు కెరీర్ ‌లోనే ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచేవిధంగా హై రేంజ్‌ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం..పూరి జగన్నాథ్, బాలయ్య బాబు కాంబినేషన్ అంటే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాటికి ధీటుగా ఈ చిత్రం సబ్జెక్ట్ ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్...తన లేటెస్ట్ చిత్రం గోలీమార్ ప్రి రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియమణి చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu