»   »  యజ్ఞం లా పవిత్రంగా బాలకృష్ణ చిత్రం కోసం...

యజ్ఞం లా పవిత్రంగా బాలకృష్ణ చిత్రం కోసం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

యజ్ఞం ఎంత పవిత్రంగా చేస్తామో.. ఈ సినిమా కూడా అంత పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం. సాంకేతికంగానూ ఇది ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఇందులో గ్రాఫిక్స్‌కి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఖర్చుకు వెనుకాడకుండా భారీ ఎత్తున సెట్స్ నిర్మిస్తున్నాం. రామ చరిత్ర ఎంత పూజనీయమైనదో.. ఈ సినిమా కూడా అంత పూజనీయమైనదిగా నిలిచిపోతుంది అంటున్నారు నిర్మాత యలమంచిలి సాయిబాబా. ఆయన బాలకృష్ణ ప్రధానపాత్రలో బాపు దర్సకత్వంలో రామరాజ్యం చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సంగీత చర్చలు చెన్నైలో మొదలయ్యాయి. బాపు, నిర్మాత యలమంచిలి సాయిబాబు, ఇళయరాజా, జొన్నవిత్తుల ఈ సంగీత చర్చల్లో పాల్గొన్నారు.ఇక ఈ చిత్రంలో సీతగా నయనతార కనిపించనుంది.

రామాయణం అనగానే.. తాటక వధ, సీతారామ కళ్యాణం, సీతారామ వనవాసం, సీతాపహరణం, రావణ వధ, శ్రీరామపట్టాభిషేకం, లవకుశుల జన్మవృత్తాంతం ఇవే అందరికీ తెలిసింది. కానీ ఇందులో రామాయణంలో చాలామందికి తెలియని మరో ఘట్టాన్ని చూపించబోతున్నాం. శ్రీరాముడు రాజ్యాన్ని పాలించిన ఘట్టం ప్రధానాంశంగా ఈ సినిమా ఉంటుంది. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమా కావడంతో శ్రీరామరాజ్యం కోసం ప్రత్యేక కృషి జరుపుతున్నాం. కథ, డైలాగులు, స్క్రీన్‌ప్లే అన్నీ సంపూర్ణంగా సమకూర్చుకొని నవంబరులో షూటింగ్ కెళ్తాం అని బాపు చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ట్: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్‌కణ్ణన్, ఎడిటింగ్: జి.జి.కృష్ణారావు, కెమెరా: పి. ఆర్కె.రాజు, సంగీతం: ఇళయరాజా, రచన, స్క్రీన్‌ప్లే: ముళ్లపూడి వెంకటరమణ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu