బాలకృష్ణ ర్యాంప్ వాక్..అంతా షాక్ (వీడియో)
హైదరాబాద్ : బాలకృష్ణ ర్యాంప్ వాక్ చేయటమేంటి...అనుకుంటున్నారా..ఇది నిజమే. ఆయన తాజాగా నగరంలోని గచ్చిబౌలిలో మిర్రర్స్ సెలూన్ మూడో శాఖ ప్రారంభోత్సవంలో ర్యాంప్ వాక్ చేశారు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు.
ఆద్యంతం ఆనందోత్సాహలతో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణకు షోరూం అధినేత విజయలక్ష్మి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఆయన ర్యాంప్ వాక్ చేసిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.
వీడియో కర్టసీ: ఎబిన్ తెలుగు ఛానెల్
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడళ్లతో కలిసి బాలకృష్ణ ర్యాంప్ వాక్ చేసి సందడి చేశారు. సినీనటులు నిఖిల్, సంజన, భానుచందర్ తదిరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











