»   » సాహసమేనా?: పైసా వసూల్ వేడుకలో బాలయ్య మళ్లీ ఆ అవతారంలో..

సాహసమేనా?: పైసా వసూల్ వేడుకలో బాలయ్య మళ్లీ ఆ అవతారంలో..

Subscribe to Filmibeat Telugu

స్టేజీల మీద గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్, పద్యాలు చెప్పాలనుకుంటాడు కానీ అలవాటుగా వచ్చిన తత్తరపాటు బాలయ్యకు బ్రేకులు వేస్తూనే ఉంటుంది. నిజానికి శ్రీనాథుని పద్యాలు, ఇతరత్రా శ్లోకాలు బాలయ్య బాగానే ఔపోసన పట్టారు. అయితే కెమెరా ముందు చెప్పినంత సహజంగా ఎందుకనో స్టేజీల మీద ఆయన వాటిని పలకలేకపోతుంటారు.

మావా ఏక్ పెగ్ లావో అంటూ పాటపాడి దుమ్మురేపిన బాల‌కృష్ణ‌.. ఫ్యాన్స్‌కు పండుగే..

ఇలాంటి తత్తరపాటుతో ప్రేక్షకులు కూడా బాలయ్య స్టేజీ మీద పద్యాలు చెబుతుంటే ఒకింత ఇబ్బందిగానే ఫీలవుతుంటారు. అలాంటిది.. ఇక ఆయన పాట పాడితే ఎలా ఉంటుంది?.. సరే ఎవరికెలా ఉన్నా బాలయ్య ఆయనకు నచ్చిందే చేస్తారు. అప్పుడెప్పుడో 'మేము సైతం' కార్యక్రమం కోసం గొంతు సవరించి అందరిని ఆశ్చర్యపరిచిన బాలయ్య.. తాజాగా మరోసారి స్టేజ్ షోకు సిద్దమవుతున్నారు.

balakrishna ready to sing song in paisa vasool audio launch

ఈ నెల 17న ఖమ్మం వేదికగా జరగబోయే తన కొత్త సినిమా 'పైసా వసూల్' ఆడియో వేడుకలో బాలయ్య మరోసారి సింగర్ అవతారం ఎత్తనున్నారు. తొలిసారిగా ఈ సినిమా కోసం 'ఏక్ పెగ్ లావో..' అంటూ పాట పాడిన బాలయ్య.. ఇప్పుడదే పాటను ఆడియో వేడుకలో స్వయంగా పాడనున్నారు. దీంతో బాలయ్య పర్ఫామెన్స్‌కు ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. చూడాలి మరి.. బాలయ్య ఎలా మెప్పిస్తారో!

English summary
Tollywood Hero Balakrishna readying to sing song on Paisa Vasool Audio event on Aug 17th. The audio of Paisa Vasool is releasing grandly with the glitters of glamorous dolls Shriya, Kyra Dutt, Charmme and Muskaan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu