»   » ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది: బాలయ్య అంతమాటా అనేసాడు

ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది: బాలయ్య అంతమాటా అనేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లో ఒక్క మగాడు కూడా ఒకటి . ఈ సినిమా కథ శంకర్ ఏనాడో తీసిన భారతీయుడు సినిమాకు దాదాపు కాపీ. సర్దార్ పాపారాయుడు సినిమా అంశ కూడా కొంత ఉంది. మొత్తం మీద బాలకృష్ణ నటన పవర్ ఫుల్ గా ఉంది. కానీ కథా కథనం బాగుండక పోవడంతో ఇంత పెద్ద సినిమా కూడా నీరుగారిపోయింది.

మామూలుగా స్టార్ హీరోల సినిమాలు కూడా ఫ్లాప్ అయినట్టే ఒక్కమగాడు కూడా ఫ్లాప్ సినిమాల్లో ఒకటి అయ్యింది. కానీ ఆ సినిమా మామూలు ఫ్లాప్ కాదు ఆ రోజుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సరే అదంతా గడిచి పోయిన కథ మళ్ళీ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకూ అంటే. మళ్ళీ ఆ విషయ తెరమీదకి వచ్చింది కాబట్టే. మామూలుగా కాదు బాలయ్య నోటినుంచే ఈ సినిమా మీద పెద్ద కామెంట్ వచ్చేసింది. అయితే ఫలానా సినిమాను తాను అనవసరంగా చేశాననీ .. ఆ మూవీ చేయకుండా ఉండాల్సిందని వాళ్లకి అనిపించే సందర్భాలూ ఉంటాయి కదా మీకూ అలా అనిపించే సినిమా ఏదైనా ఉందా అని ప్రశ్న ఎదురైంది.

Balakrishna Regrets about one of his Flop movies Okka Magadu

అలా అనిపించిన సినిమా ఏదైనా మీ కెరియర్లో వుందా? అనే ప్రశ్న తాజాగా బాలకృష్ణకి ఎదురైంది. అంతే .. ఆయన ఎంత మాత్రం తడుముకోకుండా 'ఒక్క మగాడు' సినిమా అని తేల్చి చెప్పారు. వైవీఎస్ చౌదరి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, 2008లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సిమ్రాన్ .. అనుష్క కథానాయికలుగా నటించిన ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. ఆ సినిమాను చేయకుండా ఉండాల్సిందని అనిపిస్తూ ఉంటుందని బాలకృష్ణ చెప్పారు. ఈ సినిమా ఆయనకి అంతటి చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న మాట.

English summary
Nandamuri Balakrishna Regrets about one of his Flop movies Okka Magadu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X