»   » ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ట్రైలర్ రిలీజ్‌ ప్లాన్ మొత్తం మారింది! అదేంటంటే..

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ట్రైలర్ రిలీజ్‌ ప్లాన్ మొత్తం మారింది! అదేంటంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి.

ఈ సినిమాను నంద‌మూరి బాల‌కృష్ణ 100 వ చిత్రం కావ‌డంతో నంద‌మూరి అభిమానులు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేస్తున్నారు. సినిమా విడుదలకు నెలరోజుల ముందే ప్రమోషన్స్ చేపట్టాలన్న ఆలోచనతో టీమ్ ఆడియో విడుదల వేడుకను డిసెంబర్ 16న తిరుపతిలో నిర్వహిస్తోంది.


అదేవిధంగా డిసెంబర్ 16న సాయంత్రం 5 గంటలకే సుమారు 100 థియేటర్లలో ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారట. కరీంనగర్‌లోని కోటి లింగాలలో బాలయ్య ప్రత్యేకంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తారట. అదేరోజు కోటేశ్వర సిద్ధేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆడియో లాంచ్‌కు బయలుదేరుతారట.


Balakrishna to release Gautamiputra Satakarni trailer

మరో ప్రక్క ఎన్‌.బి.కె.హెల్పింగ్ హ్యండ్ జగ‌న్ అండ్ టీమ్ ఆధ్వ‌ర్యంలో భార‌తదేశ శ‌త పుణ్య‌క్షేత్ర జైత్ర‌యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు. భార‌త‌దేశంలోని 100 పుణ్య‌క్షేత్రాల్లో 100 కేజీల కుంకుమార్చ‌నతో పాటు 23 శివ‌లింగాల‌కు రుద్రాభిషేక, స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ భార‌తదేశ స‌ర్వ‌మ‌త శ‌త పుణ్య‌క్షేత్ర జైత్ర‌యాత్ర న‌వంబ‌ర్ 5న, శ‌నివారం ఉద‌యం గం.10.45ని. ల‌కు నంద‌మూరి బాల‌కృష్ణ చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది.


'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని అంచనాలను పెంచేసింది.

English summary
Balakrishna will release Gautamiputra Satakarni trailer in Kotilingala, Karimnagar district.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu