»   » తండ్రిని స్మరించుకున్న బాలయ్య ..ఘాట్ వద్ద నివాళి (ఫోటోస్)

తండ్రిని స్మరించుకున్న బాలయ్య ..ఘాట్ వద్ద నివాళి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నట సార్వభౌముడు, అన్నగారు నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ కుమారుడు, సినిమా హీరో బాలకృష్ణ తండ్రిని స్మరించుకుంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ ని పెట్టారు. 

‘మీ కడుపున జన్మించడం నేను చేసుకున్న గొప్ప వరం. మీ ఆశయ సాధనే నా జీవితం గమ్యం. మీ కలలను నిజం చేస్తాను. మరణం లేని జననం మీది. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అంటూ పేదరికం లేని సమాజానికి బాటలు వేసిన తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు మీరు. ఓ విశ్వ విఖ్యాతా.. నీ గాధ... నీ బోధ మాకు భగవద్గీత. ఓ విశ్వ విఖ్యాతా... నీ ఘనత, నీ చరిత నిర్మించే మా భవిత. అమరపురి అధినేతా.. అందుకో మా జ్యోతా' అంటూ నివాళులర్పించారు. అదేవిధంగా ఎన్టీఆర్‌తో ఆప్యాయంగా దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటో చూడొచ్చు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు 20వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ప్రముఖులతో కిటకిటలాడింది. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తెలుగు దేశం పార్టీ వర్గాలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. స్లైడ్ షోలో బాలయ్య ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు.

బాలకృష్ణ

బాలకృష్ణ

జాతీయ స్థాయిలో తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ తెలిపారు.

జై ఎన్టీఆర్

జై ఎన్టీఆర్

జై ఎన్టీఆర్ అంటూ బాలయ్య పాటు అభిమానులు నినాదాలు చేసారు.

అభిమానులకు పిలుపు

అభిమానులకు పిలుపు

నేడు ఏన్టీఆర్ ట్రస్టు చేపట్టిన మెగా రక్తదాన శిబిరాన్ని అంతా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి హాజరై నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద

ఎన్టీఆర్ ఘాట్ వద్ద

భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణి తదితరులు హాజరై నివాళులు అర్పించారు.

బాలయ్య తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొంటూ...

బాలయ్య తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొంటూ...

మీ కడుపునా జన్మించడం నేను చేసుకున్న గొప్ప వరం . మీ ఆశయ సాధనే నా జీవిత గమ్యం ..
మీరు కన్నా కలలు స్వప్నం చేస్తాను...
మరణం లేని జననం మీది...
'సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు'' అంటూ పేదరికం లేని సమాజానికి బాటలు వేసిన తెలుగుప్రజల ఆరాధ్య నాయకుడు మీరు ..
ఓ విశ్వవిఖ్యాతా... నీ గాధ... నీ బోధ మాకు భగవద్గీత...
ఓ విశ్వవిఖ్యాతా... నీ ఘనత నీ చరిత నిర్మించే మా భవితా...
అమరపురి అధినేతా... అందుకో మా జ్యోతా... అందుకో మా జ్యోతా... అందుకో మా జ్యోతా...

English summary
Balakrishna remembers his father N.T. Rama Rao in a Face Book post.
Please Wait while comments are loading...