twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్దాయన ఎన్టీఆర్‌ను చూశామంటున్నారు

    By Pratap
    |

    "బాలయ్యను 'అధినాయకుడు'లో చూసినవారంతా పెద్దాయన ఎన్టీఆర్‌ను చూసినట్టుంది అని అంటున్నారు. బాలయ్య ఇంత గొప్ప పాత్రలు చేసినందుకు ఆనందంగా ఉంది. సంగీతం, యాక్షన్ అన్నీ సమపాళ్ళలో కుదిరాయి'' అని 'అధినాయకుడు' చిత్ర నిర్మాత ఎం.ఎల్.కుమారచౌదరి అన్నారు. ఇందులో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. లక్ష్మీరాయ్, సలోని కథానాయికలు. పరుచూరి మురళి దర్శకుడు. శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై నిర్మించారు.

    నిర్మాత మాట్లాడుతూ "పొలిటికల్ డ్రామా నేపథ్యంలో నడిచిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. అన్నీ ప్రాంతాల్లోనూ హిట్ టాక్ వస్తోంది. మా సినిమాకు ఎన్నికలతో సంబంధం లేదు. ఏ పార్టీ గురించి ఇందులో ప్రస్తావన లేదు. అన్నీ వర్గాల వారూ సినిమాను ఆదరించాలి. భాస్కరభట్ల సాహిత్యం, కల్యాణిమాలిక్ సంగీతానికి అమితాదరణ వస్తోంది'' అని అన్నారు.

    దర్శకుడు పరుచూరి మురళి చెబుతూ "కల్యాణిమాలిక్ సంగీతం, రీరికార్డింగ్ సినిమాకి పెద్ద ఎస్సెట్. సినిమాలో పెద్దాయన పాత్ర హైలైట్ అని అందరూ అంటున్నారు. చక్కటి కుటుంబకథా చిత్రాన్ని తీశానని అందరూ మెచ్చుకుంటున్నారు. మా నిర్మాత ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదు. గ్రాండ్‌గా తీశాం. సినిమా చూసినవారందరూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు'' అని తెలిపారు.

    "నచ్చావులే, మిస్టర్ ఫర్‌ఫెక్ట్ తర్వాత ఈ సినిమాలో నా పాత్రకు ఇంత మంచి పేరు రావడం సంతోషంగా ఉంది'' అని కాశీ విశ్వనాథ్ అన్నారు. మంచి సినిమాలో తానూ భాగమైనందుకు కల్యాణిమాలిక్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

    English summary
    Adhinayakudu producer Kumar Choudhari said that appreciatns are pouring from all the corners to Balakrishna's action in Adhinayakudu and he remembers NT Ramarao in Adhinayakudu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X