»   » బాలకృష్ణ 100వ సినిమాకు డైరెక్టర్ ఖరారయ్యాడోచ్!

బాలకృష్ణ 100వ సినిమాకు డైరెక్టర్ ఖరారయ్యాడోచ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ‘డిక్టేటర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన 100వ సినిమా చేయబోతున్నారు. కెరీర్ మైల్ స్టోన్ మూవీ కాబట్టి బాలయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తనకు కెరీర్లో సింహా, లెజెండ్ లాంటి భారీ విజయాలు అందించిన బోయపాటి శ్రీనుకే దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే బాలయ్యకు బోయపాటి స్టోరీ లైన్ చెప్పారని, బాలయ్య నుండి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని లెజెండ్ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బేనర్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

Balakrishna's 100th film director

బాలయ్య ‘డిక్టేటర్' సినిమా విషయానికొస్తే...
ఈ చిత్రానికి లక్ష్యం, లౌక్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియాలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలయ్య, అంజలిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేయగా.... బోయపాటి శ్రీను క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బి గోపాల్, సురేష్ బాబు, అంబిక కృష్ణ, సురేష్ బాబు, కోన వెంకట్, గోపీ మోహన్, సత్యదేవ్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, ఆర్.పి.పట్నాయక్, ధశరత్, జెమిని కిరణ్ తదితరులు హాజరయ్యారు.

నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Balakrishna's 100th film director confirmed. Boyapati Srinu floored Balayya with a storyline and got green signal from the actor to helm this project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu