»   » దసరా కానుకగా బాలకృష్ణ సినిమా.!

దసరా కానుకగా బాలకృష్ణ సినిమా.!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ తన దృష్టి మొత్తం 99 వ సినిమాపై పెట్టారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్ర్రారంభించి దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని హైదరబాద్, ఢిల్లీ, యూరప్ లలో కంటిన్యూగా షూట్ చేయనున్నారు.

ఇండియాలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ వారు, డైరెక్టర్ శ్రీవాస్ కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం ఈ సినిమాకి ‘డిక్టేటర్' అనే టైటిల్ ని ఖరారు చేసే పనిలో ఉన్నాడు.


కోన వెంకట్ - గోపి మోహన్ లు కలిసి రాసిన కథ అందించిన ఈ సినిమాకి శ్రీ వాస్ దర్శకత్వం వహించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతారని హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. గతంలో బాలకృష్ణ - నయనతార కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా', ‘శ్రీ రామరాజ్యం' పెద్ద హిట్ అయ్యాయి. వీరిద్దరి జోడీలో రానున్న మూడవ సినిమా ఇది.


Balakrishna’s 99th film gets a title

ప్రస్తుతం బాలకృష్ణ 98వ సినిమా ‘లయన్' షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని మార్చి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది పూర్తి కాకముందే ఆతన తన తన 99వ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు.


అలాగే బాలయ్య తాజా చిత్రం విషయానికి వస్తే... బాలయ్య 'లయన్' చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'లెజెండ్' లాంటి భారీ విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 'లయన్' చిత్రంలో కూడా బాలయ్య యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నాడు. సత్యదేవ్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు.


కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా టీజర్‌ని బుధవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేశారు. ఇందులో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. బాలయ్య 'కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది. మరికొందరుకొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది.' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.


Balakrishna’s 99th film gets a title

నిర్మాత మాట్లాడుతూ.. '''లెజెండ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ మా సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన కథను సత్యదేవ్ సిద్ధం చేశారు. ఈ చిత్రంతో తను అగ్ర దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ నిర్మాణ విలువలతో మేం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.'' అని చెప్పారు.


'లెజెండ్' తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉండటం సహజం. అందుకు తగ్గట్టుగానే అత్యంత శక్తిమంతంగా ఇందులోని బాలయ్య పాత్ర ఉండబోతోందని వినికిడి. సత్యదేవ్ సంభాషణలు కూడా ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నాయని సమాచారం. గన్ నుంచి విడుదలయ్యే బుల్లెట్‌కి దయా దాక్షిణ్యాలుండవ్. దానికి తెలిసిందల్లా లక్ష్యం ఒక్కటే. దాన్ని ఛేదించేదాకా అది వదలదు. ఈ లక్షణాలతో ఓ పాత్రను సృష్టిస్తే? ఆ పాత్రను బాలకృష్ణ పోషిస్తే? ఇక అభిమానులకు అంతకంటే కావల్సిందేముంటుంది!


సత్యదేవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలకృష్ణ అలాగే కనిపించనున్నారని చెప్తున్నారు. బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత.

English summary
Nandamuri Bala Krishna’s 99th movie has been confirmed in the direction of Sriwass, and Eros International will be producing the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu