twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ'అధినాయకుడు'స్టోరీ లైన్ ఏంటి

    By Srikanya
    |

    బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి తెరకెక్కిస్తున్న చిత్రం 'అధినాయకుడు'. ఈ చిత్రం అటు అభిమానుల్లోనే కాక సాధారణ ప్రేక్షకుడులో కూడా ఆసక్తి కలిగించేలా వివిధ గెటప్స్ బయిటకు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ...నాయకత్వం వ్యాపారం కాదు... వారసత్వంగా రావటానికి. వెనకనున్న పదిమంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాలి. అప్పుడే నాయకుడు అవుతాడు. అలాంటివాళ్లు మాత్రమే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొంటారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమై నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న ఓ కుటుంబం కథే మా చిత్రం అంటున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్ కుమార్‌చౌదరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆరు పాటలు సహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

    ఇక నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..'బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. నటుడిగా బాలయ్యను మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది ఈ సినిమా. బాలయ్య సినిమా సరైన విజయాన్ని అందుకుంటే... దాని ప్రభావం ఏస్థాయిలో ఉంటుందో ఇప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా చిత్రాలు నిరూపించాయి. వాటిని మించే విధంగా ఈ సినిమా ఉంటుందని ఎంతో నమ్మకంతో చెప్పగలను. పరుచూరి మురళి అంత అద్భుతంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం అని చెప్పారు.

    ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా పాటలను ఈ నెల చివరి వారంలో విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. కళ్యాణిమాలిక్ అద్భుతమైన సంగీతం అందించారని, ముఖ్యంగా నేపథ్య సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.

    English summary
    Balakrishna, Parachuri Murali upcoming film tentatively titled as Adhinayakudu wrapped up a schedule in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X