Don't Miss!
- News
కరోనాకేసుల ఊగిసలాట: కాస్త తగ్గిన కొత్తకేసులు; లక్షా ఏడువేల యాక్టివ్ కేసులు!!
- Technology
భారత మార్కెట్లోకి OnePlus Nord 2T 5G విడుదల.. ధర ఎంతంటే!
- Finance
Multibagger Stock: ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. లక్ష పెట్టిన వారికి రూ.5 లక్షలు..
- Automobiles
ఆటమ్ వాడెర్ ఇ-బైక్‌ని లాంచ్ చేసిన హైదరాబాద్ కంపెనీ.. మొదటి 1000 మంది కస్టమర్లకు బంపర్ ఆఫర్!
- Sports
India vs England 5th Test Weather : తొలి రోజు వర్షార్పణమే.. ‘టెస్ట్’ పెట్టనున్న వరుణ దేవుడు..!
- Lifestyle
ఈ 5 రాశుల తండ్రులు వారి పిల్లల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు..అందుకే చెడ్డ నాన్నలు కావచ్చు...
- Travel
సీనియర్ సిటిజన్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Akhanda OTT: బాలయ్య సినిమా స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్.. పండుగ కానుకగా ఆరోజే.. మరి టీవీలో ఎప్పుడంటే!
సుదీర్ఘ కాలంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేక తెగ ఇబ్బందులు పడుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. అయినప్పటికీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, విజయం మాత్రం ఆయనను పలకరించకుండానే వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారాయన. ఇందులో భాగంగానే తనకు గతంలో రెండు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే మూవీ చేశారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్ డేట్లు లీకయ్యాయి. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ’గా ఎంటరైన బాలయ్య
నటసింహా
బాలకృష్ణ
హీరోగా
బోయపాటి
శ్రీను
రూపొందించిన
సినిమానే
'అఖండ'.
ఎంతో
ప్రతిష్టాత్మకంగా
రూపొందిన
ఈ
మూవీని
ద్వారకా
క్రియేషన్స్
బ్యానర్‌పై
మిర్యాల
రవీందర్
రెడ్డి
నిర్మించాడు.
ఈ
మూవీలో
ప్రగ్యా
జైస్వాల్
హీరోయిన్‌గా
చేసింది.
శ్రీకాంత్
నెగెటివ్
రోల్
చేశాడు.
ఎస్
థమన్
ఈ
సినిమాకు
సంగీతం
అందించాడు.
ఇది
డిసెంబర్
2న
గ్రాండ్‌గా
రిలీజ్
అయింది.
Bigg Boss Telugu OTT: జబర్ధస్త్ నటికి బిగ్ బాస్ ఆఫర్.. అప్పుడు మిస్సైంది.. ఇప్పుడేమో ఇలా!

భారీ రెస్పాన్స్... జై బాలయ్య అని
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. చాలా కాలంగా మాంచి మాస్ మూవీ కోసం చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టేసింది. దీంతో ఈ చిత్రానికి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు భారీగా వచ్చాయి. దీంతో అంతలా జై బాలయ్య అనే మాటే వినిపిస్తూ వచ్చింది.

రెండు వారాల్లోనే టార్గెట్ కంప్లీట్
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ (రూ. 53)తో 'అఖండ' మూవీ వేట మొదలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల సమస్య ఉన్నా దీనికి మంచి కలెక్షన్లే వచ్చాయి. ఇక, నైజాంలో ఇది దుమ్ముదులిపేసింది. అలాగే మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఇలా దీనికి భారీ స్పందన దక్కడంతో రెండో వారంలోనే టార్గెట్ చేరుకుని హిట్ స్టేటస్‌ను అందుకుంది.
Bigg Boss: వీజే సన్నీకి వంద కోట్ల ఆఫర్.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. రిజెక్ట్ చేసి షాకిచ్చాడుగా!

నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి
'అఖండ' మూవీకి ఆరంభం నుంచే మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. ఫలితంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ బిజినెస్‌ను దాటి కలెక్షన్లను రాబట్టింది. ఇలా ఇప్పటికీ మంచి రెస్పాన్స్‌నే అందుకుంటూ కలెక్షన్లను బాగానే అందుకుంటోంది. దీంతో ఈ సినిమా ఇప్పటి వరకూ రూ. 16 కోట్లకు పైగానే లాభాలను కూడా అందుకుంది. ఫలితంగా ఈ ఏడాది బిగ్ హిట్‌గా నిలిచింది.

అఖండ ఓటీటీ.. టీవీ వివరాలివే
'సింహా', 'లెజెండ్' వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎన్నో అంచనాలతో వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. అలాగే, శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానెల్ భారీ ధరకు కొనుగోలు చేసింది.
హాట్ సెల్ఫీ వీడియో వదిలిన శ్రీరెడ్డి: బట్టలన్నీ తీసి పడేసి.. బాగా పెరిగిపోయాయి అంటూ!

అఖండ స్ట్రీమింగ్ డేట్ వచ్చింది
'అఖండ' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు నాలుగు వారాలు అవుతున్నా రెస్పాన్స్ మాత్రం మంచిగానే వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఈ ప్రకటన త్వరలోనే రానుందని టాక్.

అఖండ టీవీలో వచ్చేది అప్పుడే
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అఖండ' మూవీని ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్లలో చూసేశారు. కొద్ది రోజుల్లోనే ఇది ఓటీటీలోకి కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ డేట్ కూడా రివీల్ అయింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫిబ్రవరి 27న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కాబోతుందని తెలిసింది.