»   »  న్యూస్‌ రీడర్‌ బద్రి మృతికి ..బాలకృష్ణ నివాళి

న్యూస్‌ రీడర్‌ బద్రి మృతికి ..బాలకృష్ణ నివాళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యూస్‌ రీడర్‌ బద్రి(38) మృతి చెందాడు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద శనివారం రాత్రి బంధువుల వివాహానికి హాజరై తిరిగి స్వగ్రామం నల్లచర్ల మండలం ఆవుపాడుకు వస్తుండగా లక్ష్మీనగర్‌ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలకృష్ణ ఈ విషయం తెలుసుకుని వెంటనే ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ మేరకు బాలకృష్ణ ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో...

 Balakrishna's condolence to Badri

టీవి9 న్యూస్ ప్రెజంటర్ బద్రి దుర్మరణం చెందారన్న వార్త విని చింతింను. పలు అంశాలపై అనర్గళంగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడేవారు బద్రి. వార్తలను చక్కగా ప్రజెంట్ చేసేవారు. ద్వారక తిరుమల సమీపంలో కారు ముందు టైరు పగిలి చెట్టుకు ఢీ కొట్టిన ప్రమాదంలో ఆయన చనిపోయారని తెలిసింది. కారులో ప్రయాణిస్తూ గాయపడిన ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని భగవంతుడుని ప్రార్దిస్తున్నాను. ఆయన కుటుంబానికి ఎప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయి.

బద్రి పూర్తి పేరు కాళ్ల వీరభద్రరావు. ప్రమాదంలో బద్రి భార్య లక్ష్మీసుజాత, కుమారులు సాయి, సాత్విక్‌, బద్రి బంధువు గండ్రోతు తారక్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సాయి(12) ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

English summary
Noted Telugu news anchor Badri was killed in a road accident on Sunday. The fatal accident took place while he was on a family trip to Dwaraka Tirumala. Due to sudden burst of the car tyre, the car he was travelling hit a tree claiming his life. Badri, who was driving the car, said to have died on the spot. His wife and two children, also in the car, suffered severe injuries. They were rushed to Eluru hospital. Badri was 38 year old.
Please Wait while comments are loading...