»   » ‘డిక్టేటర్‌’ ఆడియో: ఫొటోలు...మాటలు

‘డిక్టేటర్‌’ ఆడియో: ఫొటోలు...మాటలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ‘‘డిక్టేటర్‌ అంటే నియంత. ఇది నా స్వభావానికి దగ్గరగా ఉండే పేరు. చైతన్యం, మార్పు కోసం ఒక్కోసారి జులుం ప్రదర్శించక తప్పదు. అప్పుడప్పుడు అత్యవసరం కూడా. ఇదే మా సినిమా నేపథ్యం. ఈ పండగకు మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను''అన్నారు బాలకృష్ణ.

బాలకృష్ణ హీరో గా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిక్టేటర్‌'. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌ అమరావతిలో వైభవంగా జరిగింది. ఆ వేడుకలో ఆయన ఇలా స్పందించారు.


ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలి సీడీని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవిష్కరించి చిత్ర హీరోగా బాలకృష్ణకు అందించారు. బాలకృష్ణ నటించిన 99వ చిత్రమైన ‘డిక్టేటర్‌' అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు.


స్లైడ్ షోలో ఆడియో పంక్షన్ ఫొటోలు ...


తొలి సీడీ ఆవిష్కరణ

తొలి సీడీ ఆవిష్కరణ

ఈ చిత్రం తొలి సీడిని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవిష్కరించారు. నందమూరి బాలకృష్ణ స్వీకరించారు.


బాలకృష్ణ మాట్లాడుతూ....

బాలకృష్ణ మాట్లాడుతూ....

‘‘మా నాన్నగారు చూపించిన దారిలో ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపిస్తూ వస్తున్నాను. మీ ఆశీస్సులతోనే ఇది సాధ్యమవుతోంది. నేను కాలం వెంట వెళ్లను. కాలం నా వెంట రావాల్సిందే. నేను దేనికీ తీసిపోను. పదవులు మనకు అలంకారం కాదు.. పదవులకు నేను అలంకారం అన్నారు.


బాలకృష్ణ కంటిన్యూ చేస్తూ...

బాలకృష్ణ కంటిన్యూ చేస్తూ...

శ్రీవాస్‌ ముక్కుసూటిగా ఉండే మనిషి. మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం కాబట్టే సినిమా అద్భుతంగా రూపొందించగలిగాం. దేశంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీస్తోన్న ఎరోస్‌ ఈ సినిమా చేసినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.


లెజెండ్ టైమ్ లోనే తెలిసింది

లెజెండ్ టైమ్ లోనే తెలిసింది

బాలయ్య చెప్తూ...సోనాల్‌ చౌహాన్‌ తపన ఉన్న నటి. ‘లెజెండ్‌' సమయంలోనే ఆమె ప్రతిభ తెలిసింది అన్నారు.అంజలి గురించి...

అంజలి గురించి...

తెలుగు హీరోయిన్లు కరవవుతున్న రోజుల్లో అంజలి దేవుడిచ్చిన వరప్రసాదం. సందడిగా ఉంటూ అందరిలో హుషారు నింపుతుంది అన్నారు బాలకృష్ణ.అండగా ఉంటా

అండగా ఉంటా

నా నుంచి ఏమీ ఆశించకుండా అందరూ అభిమానం చూపిస్తున్నారు. అదే నాకు శ్రీరామరక్ష. ఇంతమంది అభిమానులను పొందడం నా అదృష్టం. ఇది పూర్వ జన్మ సుకృతం. మనది విడదీయరాని బంధం. మా నాన్న రోజుల నుంచి మమ్మల్ని ఆదరిస్తూ వస్తోన్న అభిమానులకు ఎప్పుడూ అండగానే ఉంటా అన్నారు అభిమానులను ఉద్దేశించి బాలకృష్ణ.


పాటల గురించి బాలయ్య...

పాటల గురించి బాలయ్య...

తమన్‌తో తొలిసారి పని చేశాను. మంచి బాణీలు సమకూర్చారు. ఆయన బాణీల్లోని హుషారు నాలోనూ కనిపించింది''అన్నారు.రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ ....

రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ ....

‘‘ఈ పాటల విడుదల కార్యక్రమం అమరావతిలో జరగడం ఆనందదాయకం. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని ఆశిస్తున్నాను''అన్నారు.శుభారంభం

శుభారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ‘‘అమరావతిలో తొలిసారిగా ఆడియో వేడుక జరుపుకుంటున్న ‘డిక్టేటర్‌' బాక్సాఫీసు దగ్గర చరిత్ర సృష్టించబోతోంది. ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం నూతన రాజధానికి శుభారంభము''అన్నారు.


పేదల పాలిట పెన్నిధి

పేదల పాలిట పెన్నిధి

సాంఘిక సంక్షేమ శాఖమంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ ‘‘పేదల పాలిట పెన్నిధిగా ఈ ‘డిక్టేటర్‌' వస్తున్నాడు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో అందరిలో చైతన్యం నింపడానికి బాలకృష్ణ ఈ సినిమా చేశారు. ఇది కచ్చితంగా చరిత్ర సృష్టించే సినిమా అవుతుంది. ఈ కార్యక్రమం తర్వాత మన రాష్ట్ర నిర్మాణం మలుపు తిరుగుతుంది''అన్నారు.


శ్రీవాస్‌ మాట్లాడుతూ....

శ్రీవాస్‌ మాట్లాడుతూ....

‘‘లౌక్యం' తర్వాత బాలకృష్ణగారిని కలిశాను. ‘మనం ఒక సినిమా చేద్దాం సర్‌' అంటే వెంటనే ఓకే చెప్పేశారు. ఆయన నా మీద ఉంచిన నమ్మకమది. బాలకృష్ణతో పని చేయడం కష్టం అంటుంటారు. కానీ ఆయనతో పని చేసి చెప్తున్నా.. ఆయనతో పనిచేయడం చాలా సులభం. ఆయన దగ్గర అబద్దం చెప్పినా, నిజం దాచినా నచ్చదు. తన చుట్టుపక్కల వాళ్లూ అలాంటోళ్లు ఉండాలని కోరుకుంటారు. నేను ఆయనలాగే ఉన్నాను. అందుకే ఆయనతో పని చేయడం సులభమైపోయింది.


శ్రీవాస్ కంటిన్యూ చేస్తూ...

శ్రీవాస్ కంటిన్యూ చేస్తూ...

ఈ సినిమాకు తమన్‌ మంచి సంగీతం అందించాడు. ఈ సినిమా చేస్తున్న ప్రతి రోజు నేను ఫ్యాన్స్‌నే గుర్తుకు తెచ్చుకునేవాడిని. సినిమా చూసి అభిమానులు 20 సార్లు పండగ చేసుకుంటారు. అభిమానులు తలెత్తుకు తిరిగేలా ఈ సినిమా ఉంటుంది. పండగకు అందరూ థియేటర్లకు రండి... మనం పండగ చేసుకుందాము''అన్నారు.


తమన్‌ మాట్లాడుతూ ....

తమన్‌ మాట్లాడుతూ ....

‘‘భైరవద్వీపం' సినిమాకు మాధవపెద్ది సురేష్‌ గారి దగ్గర పని చేశా. ఆ సినిమాకు పని చేసినందుకు రూ.30 ఇచ్చారు. అలా నా తొలిసంపాదన బాలకృష్ణగారి సినిమాతోనే ప్రారంభమైంది. బాలకృష్ణ 99వ సినిమాకు పనిచేస్తాననని నేను ఎప్పుడూ వూహించలేదు. బాలయ్య ఎనర్జీకి, టెంపోకు సరిపోయేలా సంగీతం అందించడం చాలా కష్టం. మా చిత్ర యూనిట్ సహకారంతో ఈ సినిమా చేయగలిగాను''అన్నారు.


ఎవరెవరు పాల్గొన్నారు.

ఎవరెవరు పాల్గొన్నారు.

కార్యక్రమంలో కొమ్మాలపాటి శ్రీధర్‌, మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, తెనాలి శ్రవణ్‌, జి.వి.ఆంజనేయులు, అంజలి, సోనాల్‌ చౌహాన్‌, విజయలక్ష్మి, పూర్ణచంద్రరావు, గాంధీ, శివనాగమల్లేశ్వరరావు, ఎరోస్‌ చింటు, రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర, గోపీచంద్‌ ఆచంట, సాయి కొర్రపాటి, రామజోగయ్య శాస్త్రి, శ్యామ్‌ కె.నాయుడు, బెనర్జీ, బ్రహ్మ కడలి, అంబికా కృష్ణ, శ్రీధర్‌ సీపాన, గోపీమోహన్‌, కోన వెంకట్‌, రత్నం, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.


తెరవెనక, ముందు

తెరవెనక, ముందు

నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.


English summary
Balakrishna, Anjali, Sonal Chauhan's Dictator directed by Srivaas celebrated its audio launch in style in Amaravathi, Andhra Pradesh's new capital.
Please Wait while comments are loading...