»   » బాలీవుడ్‌కు వెలుతున్న బాలయ్య సినిమా!

బాలీవుడ్‌కు వెలుతున్న బాలయ్య సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య నటిస్తున్న ‘డిక్టేటర్' మూవీ హిందీలో కూడా రీమేక్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధ్యాసాధ్యాలపై దర్శకుడు శ్రీవాస్, కొందరు బాలీవుడ్ బడా నిర్మాతల మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్టు తనకు సెట్టయ్యే విధంగా ఉంటే చేసేందుకు సిద్ధంగా ఉన్నాడట బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ‘డిక్టేటర్' షూటింగ్ ఢిల్లీలో సాగుతోంది.

డిక్టటర్ మూవీని జనవరి 14న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసారు. పండగ రోజు బాలయ్య సినిమా చూడటం మరింత మాకు మరింత ఆనందాన్ని కలిగిస్తుందని అభిమానులు అంటున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థతో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ అసోసియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. మంచి మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన శ్రీవాస్ ఈ చిత్రాన్ని బాలకృష్ణ అభిమానులు, ఇతర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు.


Balakrishna's Dictator in Hindi

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఆడియోను డిసెంబర్ 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కొత్త రాజధానిలో జరుగుతున్న తొలి సినిమా ఫంక్షన్ ఇదే.


ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కథానుసారం మరో నాయికకు కూడా స్థానం ఉంది. ఈ పాత్రకు అక్షను ఎంపిక చేశామని శ్రీవాస్ తెలిపారు. 'రైడ్', 'కందిరీగ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్ష కెరీర్ కి మంచి బ్రే్క్ ఇచ్చే విధంగా ఈ పాత్ర ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ముగ్గురు కథానాయికల పాత్రలు సినిమాకి కీలంగా నిలుస్తాయని శ్రీవాస్ తెలిపారు.


‘'ఇది పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే చిత్రమవుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్టయిలిష్ లుక్ తో కనపడతారు. ఈరోస్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉంది'' అని దర్శకుడు అంటున్నాడు.


రవికిషన్, షాయాజీ షిండే, నాజర్, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయడు, డైలాగ్స్: ఎం.రత్నం, రచన: కోన వెంకట్, గోపీ మోహన్, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.

English summary
According to reports, Sriwass recently met the big shots of the production house and discussed about the possibility of remaking the Balakrishna starrer Dictator in Hindi.
Please Wait while comments are loading...