»   » ‘డిక్టేటర్’ టికెట్లకు వేలం పాటలో భారీ ధర!

‘డిక్టేటర్’ టికెట్లకు వేలం పాటలో భారీ ధర!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య నటించిన ‘డిక్టేటర్' చిత్రం రేపు విడుదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రం అంతటా బాలయ్య అభిమానుల హడావుడి మొదలైంది. బాలయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో అభిమానులు సినిమా టికెట్లకు వేలం పాట నిర్వహించారు.

హిందూపురం పట్టణంలో నిర్వహించిన వేలం పాటలో మొదటి టికెట్‌ను ఆలిండియా నందమూరి ఫ్యాన్స్‌ అధ్యక్షుడు నంబూరి సతీష్‌- రూ.13,500, రెండో టికెట్: నందమూరి ఫ్యాన్స్‌ హిందూపురం టౌన్ అధ్యక్షుడు బండారు బాలాజీ- రూ.13,000, మూడో టికెట్: కిరికెర సర్పంచ్ హెచ్‌.ఎన్‌ రాము- రూ.10,116లకు కైవసం చేసుకున్నారు. ఈ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయంతో బాలకృష్ణ పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.


ఇటీవల అమెరికాలో బాలయ్య అభిమానులు టికెట్లను భారీ ధరతో కొన్నారు. అమెరికాలో డిక్టేటర్ మొదటి టికెట్ ను 5555 డాలర్లు కొన్నారు. మన కరెన్సీలో చూస్తే టికెట్ ధర మూడు లక్షల రూపాయలపైనే. బాలయ్య సినిమా విడుదలవుతుదంటే ఇలాంటి వేలం పాటలు నిర్వహించడం ఈ మధ్య ఓ సాంప్రదాయంగా మారింది.


Balakrishna's Dictator Movie Ticket Auction

బాలయ్య 99వ సినిమా ‘డిక్టేటర్' శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించారు. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జ‌న‌వ‌రి 14న గ్రాండ్ లెవల్లో విడుద‌ల చేస్తున్నారు.


ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
Interesting news has US Distributor placed the movie ticket in an auction, one of the Telugu NRI booked it for $5555.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu