»   » ఢిల్లీలో బాలయ్య బిజీ: ఇటు షూటింగ్, అటు పాలిటిక్స్!

ఢిల్లీలో బాలయ్య బిజీ: ఇటు షూటింగ్, అటు పాలిటిక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘డిక్టేటర్' మూవీ షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలోని మెట్రో రైలులో జరుగుతోంది. ఓ వైపు షూటింగ్ పనుల్లో బిజీగా గడుపుతూనే వీలు చూసుకుని తన రాజకీయ పనులు సైతం పూర్తి చేసుకుంటున్నారు. హిందూపురం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తన నియోజకవర్గ సమస్యలపై పలువురు కేంద్రమంతులను కలుస్తున్నారు.

కాగా...డిక్టటర్ మూవీని జనవరి 14న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసారు. పండగ రోజు బాలయ్య సినిమా చూడటం మరింత మాకు మరింత ఆనందాన్ని కలిగిస్తుందని అభిమానులు అంటున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థతో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ అసోసియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. మంచి మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన శ్రీవాస్ ఈ చిత్రాన్ని బాలకృష్ణ అభిమానులు, ఇతర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కథానుసారం మరో నాయికకు కూడా స్థానం ఉంది. ఈ పాత్రకు అక్షను ఎంపిక చేశామని శ్రీవాస్ తెలిపారు. 'రైడ్', 'కందిరీగ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్ష కెరీర్ కి మంచి బ్రే్క్ ఇచ్చే విధంగా ఈ పాత్ర ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ముగ్గురు కథానాయికల పాత్రలు సినిమాకి కీలంగా నిలుస్తాయని శ్రీవాస్ తెలిపారు.

Balakrishna’s Dictator shooting at Delhi Metro Rail

‘'ఇది పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే చిత్రమవుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్టయిలిష్ లుక్ తో కనపడతారు. ఈరోస్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉంది'' అని దర్శకుడు అంటున్నాడు.

రవికిషన్, షాయాజీ షిండే, నాజర్, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయడు, డైలాగ్స్: ఎం.రత్నం, రచన: కోన వెంకట్, గోపీ మోహన్, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.

English summary
Nandamuri Balakrishna went for Delhi Metro Savari, who was in Delhi for the shooting of Dictator. Nandamuri Balakrishna travelled in Delhi Metro Rail along with sensuous beauty Anjali and other actors from Dictator.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu