»   »  రోజుకి రూ.30 లక్షలు...బాలకృష్ణ సెట్ ఖర్చు

రోజుకి రూ.30 లక్షలు...బాలకృష్ణ సెట్ ఖర్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్ని భారీ హంగులతో సినిమాని తీర్చిదిదిద్దతే.. అంత బాగుంటుంది..బిజినెస్ బాగా అవుతుంది అని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. అందుకే పాటలు, ఫైట్లపై కోట్లు గుమ్మరిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ హీరోగా చేస్తున్న 'డిక్టేటర్‌'లోని ఓ పాట కోసం ఏకంగా రూ.కోటి రూపాయలు వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది.

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం డిక్టేటర్‌. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోని ఓ పాట కోసం ఏకంగా కోటి రూపాయలు బడ్జెట్‌ కేటాయించారని సమాచారం. బాలకృష్ణ, వందల మంది డాన్సర్లతో ఈ పాటని హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ పాట కోసం ఓ భారీ సెట్‌ కూడా వేశారు.

రోజుకి రూ.30 లక్షల చొప్పున దాదాపుగా కోటి రూపాయలు ఈ పాట కోసం వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఈ పాట ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందట. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా పేరు చాలా బలమైనది. అందుకు తగ్గట్టుగానే కథని తయారు చేశారు. ఇంతకు ముందున్న రికార్డుల్ని తిరగరాసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. ప్రాణం తీసే భయం కన్నా ప్రాణం పోసే ఆయుధం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. మంచి కథకి, మంచి నటీనటులు, సాంకేతికబృందం తోడైంది. గత చిత్రాల్లాగే ఇదీ మంచి విజయాన్ని సొంతం చేసుకొంటుంద''న్నారు.

 Balakrishna’s Dictator song: One crore Budget

దర్శకుడు మాట్లాడుతూ.... అతని మాటెప్పుడూ బాణంలా దూసుకుపోతుంది. అది చట్టంలా నిలిచిపోతుంది. శాసనంగా మిగిలిపోతుంది. అతడే.. 'డిక్టేటర్‌'. నీతి తప్పిన సమాజానికి నియంతలా మారిన అసలు సిసలైన నాయకుణ్ని మా సినిమాలో చూడండి అంటున్నారు శ్రీవాస్‌.

నిర్మాత మాట్లాడుతూ '''డిక్టేటర్‌' పేరులో ఎంత శక్తి ఉందో అంతే శక్తి బాలకృష్ణ పాత్రలోనూ ఉంటుంది. ఆయన్ని చాలా స్త్టెలిష్‌గా, అభిమానులు మెచ్చేలా చూపించబోతున్నాము''అన్నారు.

నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Balakrishna’s “Dictator” makers are reportedly spending around 1 core for a song to be shot for three days on 30+ Lakhs per day with more than 100 dancers to be filmed . They have erected a huge set in a studio for the song.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu