గౌతమీ పుత్ర శాతకర్ణి న్యూ పోస్టర్
కథ, పాత్ర నచ్చితే ఎలాంటి ప్రయోగం చేయడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉండే బాలకృష్ణ హీరోగా దర్శకుడు క్రిష్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. రెండో శతాబ్దానికి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా ఉన్న ఫొటోను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. సింహాసనంపై బాలకృష్ణ కూర్చొని ఉన్న ఈ ఫొటో అభిమానులను అలరిస్తోంది.


Click it and Unblock the Notifications











