»   » బాలయ్య గ్రాండ్ సన్ పేరు ‘మన్మధ నాయుడు’!?

బాలయ్య గ్రాండ్ సన్ పేరు ‘మన్మధ నాయుడు’!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలయ్య కుటుంబం చాలా సంతోషంగా ఉంది. అందుకు కారణం బాలయ్య తాత కావడమే. ఆయన కూతురు బ్రాహ్మణి - అల్లుడు లోకేష్ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మనవడికి ‘మన్మథ నాయుడు' అనే పేరు పెట్టినట్లు సమాచారం. మన్మధ నామ సంవత్సర ఉగాది పర్వదినాన జన్మించడంతో ఈ పేరు పెట్టినట్లు సమాచారం.నిన్న జరిగిన లెజెండ్ ఆడియో వేడుకలో టీడీపీ లీడర్ రమణమూర్తి బాలయ్య గ్రాండ్ సన్ ను ‘మన్మధ నాయుడు' అని సంబోధించారు. దీంతో ఇదే పేరు అని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హైదరాబాద్

బాలయ్య మనవడికి సంబంధించిన పలు క్లోజ్ అప్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఇటీవలే నారా లోకేష్ తన కొడుకుని ఎత్తుకున్న ఫోటో ఒకటి విడుదలైనా...అందులో బాబు పోలికలు సరిగా ఏర్పడలేదు. తాజాగా బయట పడ్డ క్లోజ్ అప్ ఫోటోలో బాబు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్నారికి ఎవరి పోలికలు వచ్చాయి? నందమూరి వంశంవారి పోలికలు వచ్చాయా? నారా వంశం వారి పోలికలు వచ్చాయా? అనే చర్చల్లో మునిగి పోయారు ఫ్యాన్స్.

ఇటు బాలయ్య కుటుంబంలో....అటు చంద్రబాబు కుటుంబంలో జన్మించిన తొలి సంతానం కావడంతో రెండు కుటుంబాల వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ ఫోటోపై మీరూ ఓ లక్కేయండి, బాబు ఎవరి పోలికతో ఉన్నాడో మీ అభిప్రాయాలు వెల్లడించండి.

English summary
Meanwhile one of the TDP leader speaking at Lion audio found a good name for the newly borm. TDP leader Ramana Murthy speaking at the Lion audio mentioned about Balayya and CBN’S Grandosn. He gave his greetings to the kid calling him ‘Manmadha Naidu’. Its known that the kid born on Ugadi, Manmadha Nama Samvatsaram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu