Just In
- 1 hr ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 1 hr ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 2 hrs ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- Sports
స్మిత్‌ను ఎందుకు వదిలేశారు?.. వార్నర్ కన్నా స్టీవ్ పెద్ద నేరస్థుడు: ఇయాన్ చాపెల్
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- News
సుప్రీంకోర్టులో ఏపీ పంచాయతీ- సర్కారు అప్పీలు-ఎస్ఈసీ కేవియట్- తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఘనంగా 'లెజెండ్' 275 డేస్ విజయోత్సవం(ఫొటోలు)
ప్రొద్దుటూరు: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన 'లెజెండ్' చిత్రం విజయోత్సవ వేడుక కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘనంగా జరిగింది. అత్యద్భుత విజయాన్ని సాధించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రొద్దుటూరులోని ఓ థియేటర్‌లో విజయవంతంగా 275రోజులు ప్రదర్శించిన నేపథ్యంలో నిర్వహించిన ఈవేడుకలో హీరో బాలకృష్ణ, చిత్ర దర్శకడు బోయపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి జ్ఞాపికలు బహుకరించారు.
https://www.facebook.com/TeluguFilmibeat
ఆదివారం రాత్రి రాయల్ కౌంటీ రిసార్ట్‌లో జరిగిన 'లెజెండ్' 275 రోజుల విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. బాలకృష్ణ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కి సరైన కథ పడితే ఎలా ఉంటుందో,ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో 'లెజెండ్' మరో సారి ప్రూవ్ చేసింది. ఈ చిత్రం ఇప్పుడు 275 రోజులు పూర్తి చేసుకొంది. కడప జిల్లా ప్రొద్దుటూరు (అర్చన), కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మినీ శివ)లలో 275 రోజులు పూర్తి చేసుకుని ప్రొద్దుటూరులో 'లెజెండ్' సంబరాలు జరుపుకుంది.
బాలకృష్ణ లెజెండ్ పంక్షన్‌లో అపశ్రుతి: ఒకరి మృతి
ఆదివారం రాత్రి ప్రొద్దుటూరు పట్టణ శివార్లలో ఉన్న రాయల్ కౌంటీలో జరిగిన 'లెజెండ్' 275వ రోజు విజయోత్సవ వేడుకలకు హాజరై.. సభనుద్దేశించి బాలకృష్ణ ప్రసంగించారు. తాను ఎక్కువగా ఇలాంటి పరిపూర్ణత ఉన్న చిత్రాలను తీయడానికే ఇష్టపడతానన్నారు. అందువల్లే తన విజయాల శాతం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే పరిశ్రమ తీసే, ప్రేక్షకులు చూసే సినిమాల్లో సందేశాలు వెల్లువెత్తాలన్నారు.
స్లైడ్ షోలో విజియోత్సవ ఫొటోలు...

బాలకృష్ణ మాట్లాడుతూ...
ఉరుకులు, పరుగులు, మానసిక ఒత్తిడి, ఆందోళనలతో అనునిత్యం యంత్రంతో పోటీ పడుతూ కాలం గడుపుతున్న నేటి జీవన విధానంలో వినోదం అనేది కరవైంది. ప్రతి ఒక్కరూ వినోదం, ఆహ్లాదం, ఆనందం కోసం ఎంచుకునే మొదటి ఎంపిక సినిమానే అన్నారు.

అలాగే..
ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్న చిత్రంలో.. నవరసాలొలకాలి. కరుణ, ప్రేమ, వీర, హాస్యాలతో పాటు మిగిలిన కోణాలుండాలి. అప్పుడే సగటు ప్రేక్షకుడు ఓ మంచి చిత్రాన్ని చూశామన్న ఆనందాన్ని పొందుతాడని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

అందుకే పంచ్ డైలాగులు..
ప్రస్తుతం దేశంలో మహిళలకు భద్రత కరవైందని బాలకృష్ణ అన్నారు. అందువల్లే లెజెండ్ చిత్రంలో స్త్రీ విలువను చెబుతూ పంచ్ డైలాగులున్నాయన్నారు. వీటన్నింటిని తెలుగింటి ఆడపడుచులు ఎంతగానో ఆదరించారన్నారు.

అభిమానం వెలకట్టలేం...
తమ చిత్రబృందం రాక ఆలస్యమైనా ఎంతో ఓపికతో అభిమాన తరంగాన్ని పంచారని తెలిపారు. మీరు చూపే అభిమానం వెలకట్టలేనిది అని బాలకృష్ణ చెప్పారు.

నాన్నగారు చేసిన కృషి..
ఎన్టీఆర్ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేశారని తెలిపారు. కూడు, గూడు, గుడ్డ కల్పించాలన్న సంకల్పంతో పరిపాలన చేశారన్నారు. దేశంలోనే ప్రత్యేక పాలన అందించిన ఘనత అన్నకు దక్కుతుందన్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదైనా సాధ్యమన్నారు.

ఎప్పటికీ మరువను..
హుదుద్ తుపాను బాధితుల పట్ల తన నియోజకవర్గ ప్రజలైన హిందూపురం వాసులు అందించిన సాయాన్ని ఎన్నటికి మరువలేమన్నారు. దాదాపు రూ.50 లక్షల విరాళాన్ని అక్కడి నుంచి బాధితులకు పంపడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.

అందరికీ నష్టమే అందుకే...
అతివకు ఆపదొస్తే అందరికి నష్టమే. మన సంప్రదాయం ప్రకారం మహిళలను గౌరవించాలి. స్త్రీ లేకుంటే సృష్టే లేదు. అందుకే నారీమణులకు గౌరవం ఇవ్వాలి. మన సంస్కృతిని కాపాడుకోవాలి అని చెప్పుకొచ్చారు.

నూతన భాష్యం..
శ్రీకృష్ణార్జున, శ్రీరామరాజ్యం చిత్రాల్లో చక్కటి పాత్ర పోషించినట్లు తెలిపారు. నిద్రలో వచ్చేది కల.. అయితే.. యావత్ జాతిని మేల్కొనేలా చేసిది కళని ఆయన నూతన భాష్యం చెప్పారు.

ఆదుకుంటాను...
అభిమానులు, కార్యకర్తలు ఆదర్శంగా ఉండాలని, సేవ చేసేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. విజయోత్సవ వేడుకలను తిలకించేందుకు వస్తూ ప్రమాదానికి గురై మృతి చెందిన గంగాధర్(11) కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ....
బాలయ్య అభిమానుల్లో మమకారం ఎక్కువ. ఆయన అనుసరించే సిద్ధాంతాలు, ఆదర్శంగా ఉంటాయి. ఆయనతో మరిన్ని చిత్రాలు తీస్తానని చెప్పారు.

ఉద్వేగంగా..
లెజెండ్‌లోని కొన్ని డైలాగులను బోయపాటి ఉద్వేగ భరిత స్వరంతో చెప్పడంతో ఆద్యంతం అభిమానుల్లో కోలాహలం చెలరేగింది. ఈసందర్భంగా అశ్వని చేసిన వ్యాఖ్యానం ఆకట్టుకుంది.

చలపతిరావు మాట్లాడుతూ...
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగు చిత్రసీమ కళామతల్లి ముద్దుబిడ్డ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వారసత్వ నట దిగ్గజం బాలకృష్ణ అని సినీ నటుడు చలపతిరావు పేర్కొన్నారు. అలనాటి రోజుల్లో ఒక చిత్రం విడుదలకు ముందే ఎన్ని రోజులు ప్రేక్షకుల ముందు నిలుస్తుందన్న విషయాన్ని ఇట్టే చెప్పేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుకుని బాలయ్య చిత్ర రంగంలో చెరగనిముద్ర వేసుకున్నారన్నారు. లెజెండ్ చూస్తే ప్రతి కంటా కన్నీళ్లేనని పేర్కొన్నారు. ఈ చిత్రం ఇతి వృత్తాంతం అంత బలంగా ఉందన్నారు.

నటుడు సమీర్ మాట్లాడుతూ...
అన్న ఎన్టీఆర్‌తో కలసి నటించాలనే కల సాకారం కాలేదు. అయితే ఆ కోరిక బాలయ్య బాబు రూపంలో తీరిందని, లెజెండ్ చిత్రంలో నటించడంతో నా ఆశయం నెరవేరిందన్నారు.

మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ....
మొన్న ఎన్టీఆర్, నేడు బాలకృష్ణ చరిత్ర సృష్టించారన్నారు. మంచి చిత్రాలను తీయాలని కోరారు. బాలయ్య వస్తున్నారంటే పల్లెపల్లెన అభిమానం ఉప్పొంగుతుంది. పర్యటన సమయంలో చూసేందుకు గంటల కొద్దీ అభిమానులు ఎదురుచూస్తుంటారు. వారిని నిరాశ పరచకుండా ఎక్కడికక్కడ క్షణపాటైనా వాహనం నుంచి దిగి కనిపిస్తే కొండంత ఆనందం వారిలో కలుగుతుందన్నారు.

తెదేపా జిల్లా కన్వీనరు మల్లేల లింగారెడ్డి మాట్లాడుతూ....
అన్న ఎన్టీఆర్ ఏది చేసినా అది సంచలనమే. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బాలయ్య అటు చలనచిత్రం, ఇటు రాజకీయ రంగాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

రచయిత రత్నం మాట్లాడుతూ....
'లెజెండ్' మంచి డైలాగులతో అన్ని వర్గాలను మెప్పించామన్నారు. కెమెరామేన్ రామ్‌ప్రసాద్ అందరి సహకారంతో సృజనాత్మకంగా చిత్రీకరించామన్నారు.

ప్రత్యేకతలు..
మానసిక వికలాంగుడు వెంకట్ పాడిన పాటలు, చేసిన నృత్యం విశేషంగా అలరించింది. కడపకు చెందిన ఫ్యాషన్ నృత్య బృందం నృత్యాలు ప్రదర్శించారు.

సన్మానం
లెజెండ్ చిత్ర హీరో బాలకృష్ణను సన్మానించేందుకు అభిమానులు, తెదేపా నేతలు వేదికపైకి భారీగా తరలి వచ్చారు. గజమాలలతో సత్కరించారు.

జ్ఞాపికలు
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు బాలకృష్ణ, దర్శకులు బోయపాటి శ్రీను జ్ఞాపికలు అందచేశారు.

ధియోటర్ యజమానులకు...
రాయలసీమలో లెజెండ్ చిత్రం శతదినోత్సవం జరుపుకున్న థియేటర్ల యజమానులందరికి జ్ఞాపికలను అందించారు.

అభినందనలు..
ప్రొద్దుటూరు అర్చన థియేటర్‌లో 275 రోజులు చిత్ర ప్రదర్శన చేసి రికార్డు సృష్టించినందుకు నిర్వాహకులు కోనేటి ఓబుళరెడ్డిని సభా ముఖంగా అభినందించారు.

శాశ్వత సభ్యత్వం
రాయల్‌కౌంటీలో బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ నిర్వాహకులు మధుసూదనరెడ్డి పత్రాలను అందచేశారు.

ఎవరెవరు...
కార్యక్రమంలో శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, నాయకులు బ్రహ్మయ్య, పుత్తా నరసింహారెడ్డి, విజయమ్మ, ఖలీల్‌బాషా, విశ్వనాథనాయుడు, సురేష్‌నాయుడు, అమీర్‌బాబు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

వన్ ఇండియా తెలుగు శుభాకాంక్షలు..
'నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దీ..' అంటూ నందమూరి బాలకృష్ణ పలికిన సంభాషణలు, బోయపాటి శ్రీను దర్శకత్వ శైలి, రెండు పాత్రల్లో చూపించిన వైవిధ్యం, కథ కథనాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వెరసి 'లెజెండ్'కి మరపురాని విజయాన్ని అందించాయి. 'సింహా' తరవాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన చిత్రం 'లెజెండ్'. వారాహి చలనచిత్రం, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 2014లో 'లెజెండ్' మర్చిపోలేని విజయాన్ని నమోదు చేసుకొంది. దర్శక,హీరోలకు వన్ ఇండియా శుభాకాంక్షలు తెలియచేస్తోంది.