»   » వర్కౌట్ అవుతుందా? బాలీవుడ్‌కి బాలయ్య సినిమా!

వర్కౌట్ అవుతుందా? బాలీవుడ్‌కి బాలయ్య సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ‘లయన్' మూవీ తెలుగు బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అయితే అభిమానులకు మాత్రం సినిమా బాగా నచ్చింది. ఓపెనింగ్స్ కూడా భాగానే వచ్చాయి. తాజాగా లయన్ మూవీ బాలీవుడ్ లోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు సత్యదేవ్ వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా లయన్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. మరి బాలీవుడ్లో లయన్ స్టోరీ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

లయన్ చిత్రాన్ని తెలుగులో రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మించారు. సత్య దేవకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకట్టింది.‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటించింది.

Balakrishna's 'Lion' to be remade in Hindi

ప్రస్తుతం బాలయ్య తన 99వ సినిమా ‘డిక్టేటర్'లో నటిస్తున్నాడు. ఈ సినిమాను జనవరి 14 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. రీసెంట్ గా బాలకృష్ణపై హైదరాబాద్ లో ఇంట్రడక్షన్ సాంగ్ తీసారు. ఈ చిత్రంలో బాలకృష్ణని శ్రీవాస్‌ సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారు. బాలయ్య పలికే సంభాషణలు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచబోతున్నాయి.

తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్‌, రవికిషన్‌, కబీర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు.

ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Satyadeva, who made his directorial debut with Balakrishna's 'Lion', says that the film is going to be remade in Hindi soon.
Please Wait while comments are loading...