»   » అర సెకండ్ చాలు: బాలకృష్ణ 'లయన్‌' ట్రైలర్ (వీడియో)

అర సెకండ్ చాలు: బాలకృష్ణ 'లయన్‌' ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌:"ఆటను వేటగా మార్చటానికి నాకు అర సెకండ్ చాలు" అంటూ లయిన్ గర్జించింది. నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'లయన్‌'. త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమా బ్యానర్‌పై రుద్రపాటి రామారావు నిర్మించగా సత్యదేవ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్‌ ట్రైలర్‌ యూట్యూబ్‌లో విడుదలైంది. మీరు ఇక్కడ దాన్ని వీక్షించవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడునందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ''తెలుగు ప్రజలు కీర్తి ప్రతిష్ఠలు, భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. తెలుగు గడ్డ రెండుగా చీలిపోయింది. 'ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒక్కటే. యాసలు వేరైనా మన భాష ఒక్కటే' అని ఆనాడే నాన్నగారు చెప్పారు.


ప్రజల మనోభావాల్ని గౌరవించాల్సిందే. తెలుగు జాతి బాగుండాలని వాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కాలని నాన్నగారు కోరుకున్నారు. అందుకే సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చారు. నటనతోపాటు బాధ్యతలను నాకు వారసత్వంగా ఇచ్చారు.


నాన్నగారు ఆత్మీయాభిమానాలను నాకందించారు. అభిమానుల బలం ఉన్నంతవరకు నేను లయన్‌గానే ఉంటా. మణిశర్మ ఈ సినిమాకు మంచి బాణీలిచ్చారు. సత్యదేవాకి ఇదే తొలి చిత్రమైనా అభిమానులందరినీ అలరించేలా చిత్రాన్ని రూపొందించారు. 'పాతాళభైరవి' మొదటిగా వరద రోజులు ఆడిన సినిమా, 'అడవి రాముడు' 300 రోజులు ఆడింది.


Balakrishna's Lion Theatrical Trailer

ఇప్పుడు 'లెజెండ్‌' 400 రోజులు ఆడుతూ చరిత్ర సృష్టిస్తోంది. మే 2న ఎమ్మిగనూరులో వేడుక జరుపుకోబోతున్నాం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు'' అన్నారు.


బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

English summary
On the occasion of audio launch, LION theatrical trailer was released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu