For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిర్మాతకు బాలకృష్ణ సీరియస్ వార్నింగ్.. హీరో రాజశేఖర్ ముందే..

  By Bojja Kumar
  |
  Balakrishna Warning To Producer C Kalyan @Garuda Vega Trailer Launch

  రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన 'పిఎస్‌వి గరుడ వేగ' సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ స్పీచ్ ఆకట్టుకుంది. అనేక విషయాలను టచ్ చేస్తూ ఆయన ప్రసంగం కొనసాగించారు.

  బాలకృష్ణ మాట్లాడుతూ...ప్ర‌వీణ్ స‌త్తార్ తీసే సినిమాల‌కు ఒక‌దానితో ఒక‌టికి ఎక్క‌డా సంబంధం ఉండ‌దు. ఆయ‌న ప్ర‌తి చిత్రం కొత్త‌గా ఉంటుంది. మొదట రోటీన్ లవ్ స్టోరీ, ఎల్ బి డబ్ల్యు, గుంటూరు టాకీస్, ఇపుడు గరుడ వేగ ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా, సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి చూసేలా సినిమాల‌ను తీస్తున్నారు అన్నారు.

  రాజశేఖర్ మొదటి నుండి అంతే

  రాజశేఖర్ మొదటి నుండి అంతే

  రాజ‌శేఖ‌ర్‌గారు విల‌క్ష‌ణ న‌టుడు. మొదటి నుండి ఆయన ఎంచుకునే క‌థ‌నంలోగానీ, క‌థ‌లోగానీ, పాత్ర‌ల్లోగానీ, పెర్ఫార్మెన్స్ లో గానీ కొత్త‌ద‌నాన్ని ఆహ్వానిస్తుంటారు. ఇపుడు గరుడ వేగ చిత్రంలో కూడా నటనలో ఎంతో చురుకుదనం చూపిస్తున్నారు.... అన్నారు. వెంటనే రాజశేఖర్ మైక్ అందుకుని సార్ అంత స్పీడ్ నేను కాదు అన్నారు, దానికి బాలయ్య రిప్లై ఇస్తూ మన జనరేషనే అలాంటిది అని వ్యాఖ్యానించారు.

  సి కళ్యాణ్‌కు వార్నింగ్ ఇస్తున్నాను

  సి కళ్యాణ్‌కు వార్నింగ్ ఇస్తున్నాను

  మేము కోరుకునేది సినిమా నిర్మాత బావుండాలని. నిర్మాత బావుంటేనే చలన చిత్ర పరిశ్రమ బావుంటుంది. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమా 79 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. పైసా వసూల్ చిత్రం 78 రోజుల్లో పూర్తి చేశాం. నాతో నా 102వ సినిమా చేస్తున్న కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇస్తున్నాను. ఆ సినిమా కంటే ఒక రోజు ముందుగా పూర్తి చేయాలని చెబుతున్నాను.. అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు.

  ఇపుడు అలాంటి పరిస్థితి ఉంది

  ఇపుడు అలాంటి పరిస్థితి ఉంది

  ప్రతి సినిమాకు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అసలు ఎంత ఖర్చు పెడుతున్నామనేది కొందరు నిర్మాతకు తెలియడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇండస్ట్రీ ఉంది.... అని బాలయ్య అన్నారు.

  మన తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకం

  మన తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకం

  మన ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అభిరుచి ఉంది. నాన్నగారి రోజుల నుండి ఒక కొత్త దనం ఇస్తే ప్రేక్షకులు దాన్ని ఆదరించడం, అభిమానించడం లాంటివి చేస్తున్నారు. మన భారత దేశంలో ఎక్కడా ప్రేక్షకులకు లేని ఒక అరుదైన అభిరుచి మన తెలుగు ప్రేక్షకులకు ఉంది. పిఎస్ వి గరుడ వేగ సినిమా‌ను కూడా వారు ఆదరిస్తారనే నమ్మకం ఉంది అని బాలకృష్ణ అన్నారు.

  రాజశేఖర్ కూతుళ్ల గురించి

  రాజశేఖర్ కూతుళ్ల గురించి

  రాజశేఖర్ కూతుళ్ల గురించి బాలకృష్ణ మాట్లాడుతూ....శివాని, శివాత్మిక సమర్పణలో సినిమా విడుదల కాబోతోంది. ఇండస్ట్రీ అనేది ఇపుడు కంపెనీలా రూపాంతరం చెందింది. ఇలాంటి యంగ్ జనరేషన్ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోవడం శుభ పరిణామం. వారికి మంచి భవిష్యత్ ఉండాలని నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను అన్నారు.

  కూతుళ్లను స్టేజీ పైకి పిలిపించిన రాజశేఖర్

  కూతుళ్లను స్టేజీ పైకి పిలిపించిన రాజశేఖర్

  వెంటనే రాజశేఖర్ తన ఇద్దరూ కూతుళ్లను స్టేజీ మీదకు పిలిపించి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పగానే వారిద్దరూ బాలకృష్ణకు పాదాభివందం చేయడం, బాలయ్య వారిని ఆశీర్వదించడం ఆసక్తిగా సాగింది.

  జీవిత గురించి

  జీవిత గురించి

  రాజశేఖర్ వెనక ఉనక్న అదృశ్య శక్తి జీవితగారు, ఆవిడకు కూడా సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను అని బాలకృష్ణ అన్నారు.

  బాలయ్య రాకతో అమ్మలేని లోటు తీరింది

  బాలయ్య రాకతో అమ్మలేని లోటు తీరింది

  ``ఈ కార్యక్రమానికి వచ్చిన బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. ఇండ‌స్ట్రీలో అంద‌రికీ తెలుసు.. బాల‌కృష్ణగారు ఎక్క‌డికి వెళ్లినా అదృష్ట‌మ‌ని. జీవిత వెళ్లి మాట్లాడిన వెంట‌నే ఆయ‌న రావడానికి ఒప్పుకున్నారు. గరుడ వేగ టీజర్ విడుదలైనపు మమ్మీ ఉంది. ఇపుడు ఆవిడ లేని లోటు బాలకృష్ణగారి రాకతో తీరిపోయింది అని రాజశేఖర్ అన్నారు.

  బాలయ్యే ముహూర్తం పెట్టారు

  బాలయ్యే ముహూర్తం పెట్టారు

  జీవిత మాట్లాడుతూ ``బాల‌కృష్ణ‌గారిని పిల‌వ‌గానే వ‌చ్చారు. మేం ఇంటి నుంచి ఎన్ని గంట‌ల‌కు బ‌య‌లుదేరాలో కూడా ఆయ‌నే ముహూర్తం పెట్టారు`` అని చెప్పారు.

  బాలయ్య వచ్చారు, ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో...

  బాలయ్య వచ్చారు, ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో...

  బాల‌కృష్ణ‌గారికి హ్యూజ్ థాంక్స్. గుంటూరు టాకీస్ సినిమాను రూ.2 కోట్ల‌తో తీశారు. ఆ సినిమా వేడుకకు బాలయ్య గెస్ట్‌గా రావడం వల్ల పాతిక కోట్లు క‌లెక్ట్ చేసింది. ఈ సినిమాను పాతిక కోట్ల‌తో చేశాం. ఈ సినిమా వేడుకకు కూడా బాలయ్యగారు వచ్చారు. మరి ఈ చిత్రం ఎన్ని కోట్లు క‌లెక్ట్ చేస్తుందో చూడండి అంటూ... ప్రవీణ్ సత్తారు వ్యాఖ్యానించారు.

  English summary
  Balakrishna lanched Rajaskehar's PSV Garuda Vega trailer yester day. PSV Garuda Vega 126.18M is a upcoming Indian Telugu-language action film Releasing on Nov 3rd 2017 written and directed by Praveen Sattaru and produced by M Koteswara Raju starring Rajasekhar, Pooja Kumar, Kishore and Shraddha Das.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X