For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ' కాన్సెప్టు ఏంటి?

  By Srikanya
  |

  హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శ్రీమన్నారాయణ'. ఈ చిత్రంలో బాలకృష్ణ జర్నలిస్టుగా కనిపించనున్నారు. పార్వతి మెల్టన్‌, ఇషాచావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి రమేష్‌ పుప్పాల నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వారంలోనే పాటల్ని విడుదల చేస్తారు.

  ఈ చిత్రం కాన్సెప్టు గురించి దర్శకుడు రవిచావలి మాట్లాడుతూ...అక్షరానికి ఉన్న శక్తి అణుబాంబుకి కూడా లేదు. స్ఫూర్తిని కలిగించి, చైతన్యాన్ని నింపి నవశకానికి మార్గదర్శనం చేసేది అక్షరమే. కలాన్నే ఆయుధంగా మలుచుకొని కదనరంగంలోకి దూకిన ఓ పాత్రికేయుడు సాధించిన విజయాలేమిటో మా సినిమాలో చూడండి అన్నారు రవికుమార్‌ చావలి.

  అలాగే ''పాలన కొంతమంది చేతుల్లోనే ఉంది. దేశ భవిష్యత్తు అంతా వాళ్లే నిర్ణయిస్తున్నారు. ఓటు వేసే ముందు... మద్యం, డబ్బు ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తున్నాయి. వీటి మధ్య ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఒక్క పాత్రికేయుడు మాత్రమే వారిని సరైన దిశలో నడిపించగలడు. అలాంటి శక్తిమంతమైన పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారు. ఆయన పలికే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. చక్రి బాణీలు ఆకట్టుకొంటాయి. ఇదే నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అని చెప్పుకొచ్చారు.

  బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.

  English summary
  Balakrishna is going to be seen in a power packed role as a journalist in ‘Srimannarayana’ film. ‘Srimannarayana’ will be having its audio release on August 6th. The event will be held in a big way and currently, post production activities are going on. Ravi Kumar Chavali has directed the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X