»   » కుర్ర హీరోయిన్ బాలకృష్ణ మెసేజ్...షాక్

కుర్ర హీరోయిన్ బాలకృష్ణ మెసేజ్...షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణకు ఓ గొప్ప అలవాటు ఉంది. తన తోటి నటీనటులును ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూంటారు. వారి పట్ల చాలా అభిమానంగా ఉంటూంటారు. ఎంతకాలమైనా వారిని పలకరిస్తూంటారు. అటువంటి సంఘటనే రీసెంట్ గా జరిగింది. సింహా చిత్రం టీవిలో వచ్చింది. ఇందులో నటించిన స్నేహా ఉల్లాల్ కు బాలకృష్ణ ఈ చిత్రం టీవిలో మరోసారి చూసి చాలా బాగుందంటూ మెసేజ్ పెట్టారు. ఈ విషయాన్ని స్నేహ ఉల్లాల్ స్వయంగా తెలియచేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

స్నేహ ఉల్లాల్ ట్వీట్ చేస్తూ..." సింహా బాలకృష్ణ గారి నుంచి నా వర్క్ గురించి కాంప్లిమెంట్ చేస్తూ ప్రసంస చేస్తూ మేసేజ్ రావటం షాక్ కు గురి చేసింది. నిన్న సింహా చిత్రం చూస్తూ ఆయ మేసేజ్ చేసారు..నేను చాలా లక్కీ ." అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం స్నేహ ఉల్లాల్ కెరీర్ విషయానికి వస్తే...

అచ్చం అలనాటి అందాల నటి మందాకినిలా, కొన్ని యాంగిల్స్ లో ఐశ్వర్యా రాయ్ లా కూడా ఉండి, తెలుగులో సింహా, ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలతో కొద్దిపాటి హిట్లు సాధించి.. ఇప్పుడు అంతగా మార్కెట్ లేని స్నేహా ఉల్లాల్.. మళ్లీ బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

Balakrishna 's Sweet Surprise To Sneha Ullal

తొలిసారి హిందీలో ఆమెకు అవకాశం కల్పించిన బాలీవుడ్ బ్రహ్మచారి సల్మాన్ ఖానే ఇప్పుడు కూడా ఆమెకు మరో చాన్సు ఇస్తున్నాడు. 'లక్కీ.. నో టైం టు లవ్' అనే చిత్రంలో స్నేహా ఉల్లాల్ తొలిసారి హిందీతెరపై కనిపించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. లక్కీ సినిమా నాటినుంచే సల్మాన్ ఖాన్ తనతో టచ్ లోనే ఉన్నారని, అప్పటికి సినిమాలంటే తనకు భయం పోలేదు గానీ ఇప్పుడైతే బాగా అనుభవం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానని స్నేహా ఉల్లాల్ చెప్పింది.

సినిమాల్లో బాగా ఆకర్షణీయంగా కనిపించాలని సల్మాన్ చెప్పాడని, జిమ్ ఎలా చేయాలో చెప్పడమే కాక, బెల్లీ డాన్సు కూడా నేర్చుకోవాలని సూచించాడని తెలిపింది. ఇప్పటికి కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి, ఇక మీదట సినిమాలు ఎంచుకునేటప్పుడ జాగ్రత్తగా ఉంటానని అంటోంది.

తెలుగులో కరెంట్‌, సింహా తదితర చిత్రాల్లో కనిపించిన స్నేహా ఉల్లాల్‌కి తమిళ చిత్రాల్లో నటించే ఛాన్సు లభించిందీ ఆ మధ్య. 'వేదం' చిత్రాన్ని తమిళంలో పునర్నిర్మిస్తుంటే అందులో శింబు సరసన నటిచింది. అయితే ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు.

English summary
Sneha Ullal tweeted, "Was shocked n delighted to receive Simha Balakrishna sir's msg complimenting my work after watching the movie yesterday. Lucky girl indeed." (sic)
Please Wait while comments are loading...