»   » ఆ విషయంలో తేడా వస్తే ఊరుకోను: బాలయ్య

ఆ విషయంలో తేడా వస్తే ఊరుకోను: బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సమయపాలన, క్రమశిక్షణ, మర్యాద పాటించడంలో కచ్చితంగా ఉంటానని, తేడా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ‘డిక్టేటర్' బాలయ్య తేల్చి చెప్పారు. డిక్టేటర్ విడుదల సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. సమయపాలన, క్రమశిక్షణ, మర్యాద... ఈ మూడింటిని తాను మొదటి నుంచి పాటిస్తునక్నానని, సినిమాల విషయంలో మాత్రమే కాదు.... రాజకీయాల్లోనూ, వ్యక్తిగత వ్యవహారాల్లోనూ ఇదే క్రమశిక్షణ పాటిస్తానని చెప్పారు.

సినిమా షూటింగ్ కు చెప్పిన సమయం కంటే కొంచెం ముందుగానే చేరుకుంటానని, తన పని తాను చేసుకుపోతానని చెప్పారు. డిక్టేటర్ సినిమాలో అన్నీ సూపర్ గానే ఉంటాయన్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం... ఇలా ప్రతి అంశం బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పారు.

Balakrishna said about his discipline

తన చిత్రాల టైటిళ్లలో పవర్ ఉంటుందని, సినిమాల్లోని క్యారెక్టర్ కు తగిన విధంగానే టైటిల్స్ ఉంటాయని తెలిపారు. డిక్టేటర్ క్యారెక్టర్, కథ కూడా అలాగే ఉంటుంది. ప్రభుత్వం ఎవరిదైనా, సారథులు ఎవరైనా... దేశ ఆర్థిక వ్యవస్థను శాసించేదంతా కొందరు వ్యాపారవేత్తలే. అలాంటి కుటుంబవ్యక్తిగా కనిపిస్తాను, ఢిల్లీ నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలిపారు.

సినిమాలోని డైలాగులు...ఇప్పటి రాజకీయ పరిస్థితులు, వ్యక్తులను ఉద్దేశించి ఉన్నాయనే విమర్శపై స్పందిస్తూ....సినిమాలో రాజకీయ అంశాలు ఉన్నాయి కానీ, అంతా జనరల్ గానే ఉంది కానీ, ఎవరినీ ఉద్దేశించి కాదు. ప్రముఖ నటి రతి అగ్నిహోత్రి నాతో ఢీ అనే అండే ఢీ అనే పొలిటీషియన్‌గా కనిపిస్తుంది అని తెలిపారు.

English summary
In a recent Interview Balakrishna said about his discipline.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu