»   » ప్రాణదాతగా మారిన బాలకృష్ణ

ప్రాణదాతగా మారిన బాలకృష్ణ

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ప్రొద్దుటూరు: ఓ అభిమానికి పునర్జీవితాన్ని ఇవ్వటానికి బాలకృష్ణ ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే...కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన తన అభిమాని రబ్బా శ్రీనివాసరావుకు రెండు మూత్రపిండాలు దెబ్బ తిని అస్వస్ధతకు లోనయ్యారు. ఆయనకు మూత్రపిండాల మార్పిడి అవసరమని వైద్యులు తేల్చారు. అయితే అంత ఖరీదైన వైద్యానికి సరపడ డబ్బు లేకపోవటంతో బాలకృష్ణ ఆదుకున్నారు.

  కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు పోతుగంటి వీరయ్య ఈ విషయం తెలుసుకుని.. బాలకృష్ణను సంప్రదించారు. తెలుసుకున్న బాలకృష్ణ వెంటనే స్పందించి తన వద్దకు ఆ పేషెంట్ ను తీసుకురమ్మని కోరారు. దాంతో మంగళవారం శ్రీనివాసు కుటుంబం హైదరాబాద్ చేరుకుని బాలకృష్ణ నివాసానికి వెళ్లి కలిసారు. అప్పుడు ఆయన ఖర్చు మొత్తం భరిస్తానని హామీ ఇచ్చారు. మరో ప్రక్క నందమూరి ఫ్యాన్స్ వెబెసైట్ వారు, కడప బాలకృష్ణ అభిమానులు కలిసి ఓ లక్ష రూపాయలు విరాళం ఆ పేషెంట్ ఖర్చు నిమిత్తం అందచేసారు.

  ఇక ప్రస్తుతం బాలకృష్ణ మరో చిత్రం కమిటయ్యారు. ఆ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. గతంలో లక్ష్మి నరసింహ చిత్రంలో పోలీస్ అధికారిగా కనిపించిన బాలకృష్ణ చాలా కాలం గ్యాప్ తర్వాత అదే చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రంలో పోలీస్ గా అదరకొట్టనున్నారని తెలుస్తోంది.

  నిఖిల్ హీరోగా వచ్చిన వీడు తేడాతో దర్శకుడుగా మారిన చిన్ని కృష్ణ ఈ కొత్త చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. గతంలో సునీల్ తో ఈ చిత్ర దర్శకుడు చిత్రం అనుకున్నారు కానీ మెటీరియలైజ్ కాలేదు. ఈ నేపధ్యంలో బెల్లంకొండ సురేష్ ..బాలకృష్ణకు ఈ కథ వినిపించి ఒప్పించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ కూడా కథ విని వెంటనే ఓకే చేసినట్లు చెప్తున్నారు. ఓ పెద్ద హీరోయిన్ ని ఈ చిత్రం కోసం అడుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు అఫీషియల్ గా ప్రకటించే అవకాసం ఉంది.

  English summary
  Apart from offering free health services to Cancer patients through Basavatarakam Trust, hero Balakrishna and his fans helped a kidney patient in Proddaturu of Kadapa district. Rabbaa Srinivasulu, the admirer of Nandamuri heroes is suffering with failure of two kidneys. Doctors advised the surgery for kidney replacement immediately else his life is in danger. Srinivasulu survived by wife and two daughters is very poor. Nandamuri fans of Kadapa district brought this to notice of Balakrishna. Responding immediately, Balakrishna and his fans donated Rs.1 Lakh of cash to Srinivasulu arranging for the kidney surgery.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more