»   » బాలయ్య 'సింహా' నికి పోలీసుల రక్షణ

బాలయ్య 'సింహా' నికి పోలీసుల రక్షణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ హీరోగా చేస్తున్న 'సింహా' చిత్రం షూటింగ్ తెలంగాణవాదులు అడ్డుకోవడంతో నిన్న(సోమవారం) నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే చిత్రం షూటింగ్ పోలీసుల భద్రతా ఏర్పాట్లు మధ్య తిరిగి మంగళవారం మొదలైంది. కీసర మండలంలోని రాంపల్లిదాయర గ్రామంలో ప్రస్తుతం షూటింగ్ కంటిన్యూ గా జరుగుతోంది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రామస్థులను ఊచకోత కోసే సన్నివేశాలు చిత్రించడానికి విలన్లు ట్రాక్టర్ లో వచ్చే సన్నివేశాలను ప్రస్తుతం ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. దర్శకనిర్మాతలు కోరిన మేరకు షూటింగ్ కు 60 మంది పోలీసులతో భద్రత కల్పించినట్టు పోలీసు అధికారి ఒకరు వివరించారు. ఈ చిత్రం గతంలో భద్ర, తులసి చిత్రాలు రూపొందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత పరుచూరి కిరీటి మీడియాతో మాట్లాడారు. సినిమాలను అందరూ చూస్తారనీ, దేశవిదేశాల్లో ఉండే తెలుగువారిని సైతం వినోదింపజేసేందుకు తాము సినిమాలు తీస్తామనీ, ఎవరికీ వ్యతిరేకం కాదనీ పరుచూరి కిరీటి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న వారి మనోభావాలను తాము అర్ధం చేసుకోగలమనీ, అలాగే సినిమాలు అడ్డుకుంటే అనేక మంది ఉపాధి కోల్పోతారని వారు అర్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాననీ అన్నారు. అలాగే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం ఒక్కటే కాకుండా సినిమాల మీద ఆధారపడి వందలాది కుటుంబాలు బతుకుతున్నాయనీ, ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో 400 మందికి పైగా పాల్గొంటున్నారనీ, అందరికీ సినిమానే ఉపాథి అని ఆయన చెప్పుకొచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu