»   » భాగ్యనగరంలో మెన్న పవన్ ‘పులి’ ఇప్పుడు బాలయ్య ‘సింహ’!

భాగ్యనగరంలో మెన్న పవన్ ‘పులి’ ఇప్పుడు బాలయ్య ‘సింహ’!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఎస్‌ జె సూర్య దర్శకత్వంలో క్రేజీ ప్రోజెక్ట్‌గా రూపొందుతున్న 'కొమరం పులి" చిత్రం గత రెండు రోజుల నుండి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంటోన్న విషయం తెలిసింది మరి ఇప్పుడు యువరత్న బాలకృష్ణ నటిస్తున్న చిత్రం 'సింహా" ఈ రోజు (03.02.10)నుండి హైదరాబాద్‌ పరిసర ప్రాంతల్లో షూటింగ్ జరుపుకుంటుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. శరవేగంగా సాగుతున్న ఈ చిత్ర క్లైమాక్స్ ను రామ్ లక్ష్మణ్ నేతత్వంలో చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ నెల 20 నుండి విదేశాల్లో పాటలు చిత్రీకరిస్తున్నాం, మా సంస్థలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిత మవుతున్న చిత్రం ఇది. షూటింగ్ మొత్తం జరుపుకుని ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం..బాలకృష్ణ గారు ఈ చిత్రంలో సరికొత్త కోణంలో కనిపిస్తారు. అని వివరించారు. తర్వాత దర్శకుడు శ్రీను మాట్లాడుతూ, బాలకృష్ణ గారి పాత్ర చిత్రణ, శారీరక భాష, అభినయం, అంతా ఎంతో చక్కగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 'సింహా"లో సింహాంలా ఉంటారు అన్నారు. ఈ సినిమాకి చక్రి మంచి సంగీతం అందించారు, చక్కని సాంకేతిక బృందం లభించడంతో, చిత్రం చక్కగా వచ్చింది..అని ఆయన వివరించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్ నటిస్తున్న సంగతి తెలిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu