»   » బాలకృష్ణ 'సింహా' రిలీజు అప్పుడేనంటున్నారు

బాలకృష్ణ 'సింహా' రిలీజు అప్పుడేనంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలయ్య, నయనతార, నమిత,స్నేహ ఉల్లాల్ కాంబినేషన్ లో బోయపాటి శ్రీను రూపొందిస్తున్న 'సింహా' చిత్రం రిలీజు కోసం వేసవి దాకా ఆగాల్సిందేనంటున్నారు. ఈ విషయాన్ని నిర్మాత పరుచూరి మురళి మీడియాతో చెప్తూ...వేసవికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం రీ రికార్డింగ్‌ పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే ఈ చిత్రంలో బాలయ్య ఆంగికం, వాచకం, అభినయం అన్నీ కొత్తగా ఉంటాయి. ఇందులో అభిమానులు కొత్త బాలయ్యను చూస్తారు. మా చిత్రం టైటిల్‌కు మంచి స్పందన వచ్చిందని చిత్రం గురించి వివరించారు. ఈ చిత్రం మిగతా పాత్రల్లో కె.ఆర్‌.విజయ, కిన్నెర, సుధ, ఝాన్సీ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, కృష్ణభగవాన్‌, వేణుమాధవ్‌, ఎల్బీ శ్రీరామ్‌, సాయికుమార్‌, హేమంత్‌, శ్రావణ్‌, జీవీ, ఆనంద్‌, దిల్‌ రమేష్‌, ఆనందభారతి తదితరులు కనిపించనున్నారు. కెమెరా ఆర్థర్‌.ఎ.విల్సన్ సమకూరుస్తూంటే...ఎడిటింగ్ ... కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం చక్రి అందిస్తున్నారు. మిత్రుడు చిత్రం అనంతరం బాలకృష్ణ చేస్తున్న చిత్రం ఇది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu