Don't Miss!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- News
ఏపీలో కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్షా ఫలితాలు వెల్లడి: రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
‘ఫ్యాన్స్‌ను బాలకృష్ణ అందుకే కొడతాడు.. కొడితే తప్పేముంది.. ఆయన ఓ రకం పిచ్చివాడు’
సినీ రంగంలోను, రాజకీయ రంగంలోనే విశేషంగా రాణిస్తున్న నందమూరి బాలకృష్ణ తరుచూ వివాదాల్లో కూరుకుపోతున్నారు. బహిరంగ వేదికలపై అభిమానులను కొట్టడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇటీవల అభిమానిపై బాలకృష్ణ చేయి చేసుకోవడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఇలాంటి విషయాలపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ...

ప్రజలను కొట్టడు.. అభిమానులపైనే దాడి
నందమూరి బాలకృష్ణతో నాకు మంచి పరిచయం ఉంది. ప్రజలను కొడుతారంటే నేను ఒప్పుకొను. అభిమానులపై మాత్రమే చేయి చేసుకొంటాడు. అదీ తన మీద పడితే ఆయన సహించలేడు. అందుకే ఫ్యాన్స్‌ను కొడుతారు. మీద పడితే కొడతాడని తెలిసి కూడా ఫ్యాన్స్ ఎందుకు దగ్గరకు వెళ్లాలి. అంటూ తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

పులి నోట్లో తలపెడితే కరవదా..
పులి కరుస్తుందని తెలుసు. దాని దగ్గరకి వెళ్లి నోట్లో చేయి లేదా తలపెడితే కరవదా? అని తమ్మారెడ్డి పేర్కొన్నారు. బాలకృష్ణ పులియో, సింహమో అనేది ఇప్పుడు ప్రస్తావన కాదు. కానీ తనపైన పడితే కొట్టడం చేస్తుంటాడు. అలా కొట్టించుకోవడం ఎందుకు వీడియోలో సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఎందుకు.. బాలకృష్ణ అలా కొట్టడంలో తప్పేమీ లేదు అని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు.

బాలయ్యకు అలాంటి పిచ్చి
బాలకృష్ణకు ఎలాంటి పట్టింపులు ఉండవు. ఆవేశం వస్తే ఆలోచించడు. ఆయనకు అమాయకంతో కూడిన ఓ పిచ్చితనం ఉంది. ఆయనకు ఒకరిపై కోపతాపాలు ఉండవు. ఆవేశం వస్తే ఏమైనా చేస్తాడు. బాలకృష్ణ గురించి నాకు బాగా తెలుసు అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

ఈ జనరేషన్‌తో పోటీ పడటం కష్టం
ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమా నిర్మాణం, దర్శకత్వానికి దూరంగా ఉండటం వెనుక ప్రత్యేక కారణాలు లేవు. ఈ జనరేషన్‌తో పోటీ పడి సినిమా తీసే సత్తా నాకు లేదనే అభిప్రాయం కలిగింది. యువ దర్శకులు పనితీరు, వారు తీస్తున్న సినిమాలు బాగా ఉంటున్నాయి. మంచి కథ లభిస్తే.. సినిమా నిర్మించడానికి, దర్శకత్వం వహించడానికి రెడీ అని అన్నారు.

మే 28వ తేదీన BB3 రిలీజ్
ఇదిలా ఉండగా, బాలకృష్ణ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇంకా పేరుపెట్టని BB3గా వ్యవహరిస్తున్న సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రం మే 28వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, రాం ప్రసాద్ కెమెరా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.