»   » అందుకే మోక్షజ్ఞను గోవా ఫెస్టివల్ కి బాలయ్య...?

అందుకే మోక్షజ్ఞను గోవా ఫెస్టివల్ కి బాలయ్య...?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ఈ ఏడాది గోవా చిత్రోత్సవాలకు వెళుతోన్న బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞను కూడా తీసుకెళ్లుతున్నారు. అది ఎందుకూ అంటే... మోక్షజ్ఞ త్వరలో వెండితెర అరంగేట్రం చేయనున్నాడు కాబట్టి ఆ వేడుకలో మోక్షజ్ఞ పది మంది దృష్టిలో పడటం బాగుంటుందనుకున్నారట బాలయ్య. మోక్షజ్ఞను నేషనల్,ఇంటర్నేషనల్ మీడియా ముందు ఫోకస్ చేసే దిశగా శ్రద్ధ పెట్టారు బాలకృష్ణ. ఈ గోవా ఫెస్టివల్ ని అందుకు వేడుకగా చేసుకోనున్నారు అంటున్నారు. ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆయన గురువారం గోవా బయలుదేరతున్నారు.

  గోవాలో నిర్వహిస్తున్న 43వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు ముగింపు దశకు చేరుతున్నాయి. ఈ నెల 30న ముగింపు వేడుకల్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణకి ప్రత్యేక ఆహ్వానం అందింది. బాలకృష్ణతోపాటు ఆయన కుమారుడు మోక్షజ్ఞ కూడా ఆ చిత్రోత్సవాలకు వెళ్లే అవకాశం ఉంది. గతేడాది నిర్వహించిన 42వ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఆయన నటించిన 'శ్రీరామరాజ్యం' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.

  ఇక ఈ సంవత్సరం జరుగుతున్న ఈ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా జరుగుతున్న వేడుకలు ఇవి. ఇక, వందేళ్ల చరిత్ర విషయానికొస్తే... అందులో తెలుగు సినిమా పరిశ్రమ కృషి శాతం చాలానే ఉంది. దక్షిణాదిన అత్యధిక చిత్రాలను నిర్మించే పరిశ్రమగా తెలుగువారికి పేరుంది. అయినప్పటికీ వందేళ్ల భారతీయ సినిమాకి సంబంధించి రూపొందించిన 'డాక్యుమెంటరీ'లో మన తెలుగు సినిమా ప్రస్తావన లేకపోవడం అక్కడ పెద్ద చర్చనీయాంశమైంది.

  జరిగిన ఈ తప్పిదాన్ని నిర్వాహకుల కమిటీ ఆలస్యంగా గ్రహించింది. అందుకే తెలుగు పరిశ్రమవారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిర్వాహకులు పడ్డారు. ఆ ప్రయత్నంలోనే ఈ ఉత్సవాల ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా రావల్సిందిగా మన తెలుగు ప్రముఖులకు కబురు పంపారు. ఆ కబురు నేపథ్యంలో మన పరిశ్రమ నుంచి ఎవరు వెళ్లాలి..? అనే ప్రశ్న తెలుగు సినీ ప్రముఖులకు తలెత్తింది. కొన్ని పేర్లు అనుకుని 'షార్ట్ లిస్ట్' చేశారు. ఆ లిస్టులో బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోల పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఫైనల్‌గా ఉత్సవ నిర్వాహకుల ఆహ్వానానికి బాలయ్య తలూపినట్లు సమాచారం.

  English summary
  Nandamuri Balakrishna’s agreed to be the chief guest for the closing ceremony of the 43rd film festival in Goa. Ironically, no one in Tollywood is complaining either. So after a long hiatus, a top Telugu star will be the “guest of honour” at IFFI. The NTR family scion will take the opportunity to introduce his son Mokshagna to the national and international media since he is going to launch him soon in films.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more