»   » ‘యంగ్ లయన్‌’గా... బాలయ్య వారసుడు!

‘యంగ్ లయన్‌’గా... బాలయ్య వారసుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ నటుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా రంగ ప్రవేశం చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోక్షజ్ఞ ఓ వైపు చదువు కొనసాగిస్తూనే, మరో వైపు సినీ రంగ ప్రవేశానికి కావాల్సిన నటన, డాన్స్, ఫైట్స్ లాంటి విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

కాగా...బాలయ్య తనయుడు ఇంకా సినిమా రంగంలోకి ప్రవేశించక ముందే ఆయనకు సినిమా రంగంలో వాడే ట్యాగ్ లైన్లు తగిలించేసారు. బాలయ్యకు ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో 'నందమూరి నట సింహం' అనే పేరు ఉంది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞకు 'యంగ్ లయన్' అనే ట్యాగ్ తగిలించారు.

Balakrishna son Mokshagna Birthday today

ఈ మేరకు ఈ రోజు మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని 'యంగ్ లయన్' మోక్షజ్ఞ అంటూ పోస్టర్లు వెలిసాయి. మరో వైపు నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే 'యంగ్ టైగర్' ట్యాగ్‌తో జూ ఎన్టీఆర్ బాగా పాపులర్ అయిన సంగతి. మరి యంగ్ లయన్‌గా రాబోతున్న మోక్షజ్ఞ ఇండస్ట్రీలో...తండ్రి పేరును ఎలా నిలబెడతాడో చూడాలి.

కాగా...బాలయ్య సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం 2014లో మోక్షజ్ఞ నటించబోయే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. అందులో భాగంగానే మోజ్ఞను విదేశాలకు పంపి అక్కడ మార్షల్ ఆర్ట్స్, డాన్స్, యాక్టింగులో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు.

త్వరలో తెలుగుదేశం పార్టీ తరుపున పూర్తిగా క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లే యోచనలో ఉన్న బాలయ్య తాను సినిమాల్లో ఉన్నప్పుడే మోక్షజ్ఞ భవిష్యత్ కు పునాది వేయాలని యోచిస్తున్నారు. ఈ మేరకు అతను చేయబోయే తొలి సినిమా కథ, దర్శకుడు, స్ర్కిప్టు తదితర విషయాలను బాలయ్యే స్వయంగా దగ్గరుండి చూసుకోనున్నారట. ఏది ఏమైనా తన వారసుడి ఎంట్రీ అదిరి పోవాలని, ఇందుకోసం మంచి సత్తా ఉన్న దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారు.

English summary
Tollywood star actor Nandamuri Balakrishna son Mokshagna Birthday today. Balakrishna has clarified that his son Mokshagna would foray into films only after he completes studies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu