»   » ‘సింహా’ విజయం తెలుగుసినీ పరిశ్రమకు ప్రాణం పోసింది!

‘సింహా’ విజయం తెలుగుసినీ పరిశ్రమకు ప్రాణం పోసింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముందుగా 'సింహా" చిత్రం అఖండ విజయం సాధించినందుకుగాను బాలయ్య బాబుకి 'మా" అభినందనలు. ఈ రోజే ప్రకటించిన దాసరి బాలయ్యల కొత్త సినిమా 'పరమవీరచక్ర" కూడా ఘనవిజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. హీనదశలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు 'సింహా" విజయం ఊపిరిలూదిందని ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో 'మా" అద్యక్షడు మురళీమోహన్ అన్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఇన్నాళ్లకు మా ఇద్దరి కలయికలో సినిమా రావాలాన్న ఎంతోమంది నిరీక్షణకు 'పరమవీరచక్ర" రూపంలో తెరపడనుంది. నాన్నగారు చేసిన 'బొబ్బీలిపులి" పులి సినిమా గుర్తుకొస్తోంది ఈ టైటిల్ వింటూ ఉంటే. దాసరి గారి గత చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా ఉంటుందని, వాటన్నిటికంటే పెద్ద విజయం సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. మా ఇద్దరికీ కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఆయనలో, నాలో ఆవేశం, అమాయకత్వం సమ పాళ్ళలో ఉన్నాయి. మా పనేదో మేము చేసుకుపోయే మనస్తత్వం ఇద్దరిదీ. ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా ఘనవిజయం పొందాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను" అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu