For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అది అబద్దం, నాకు పిచ్చి అనుకోవచ్చు... తెలుగోడి దెబ్బ చూపించే సమయం: బాలయ్య పవర్‌ఫుల్ స్పీచ్

  |

  మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

  ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ఈ వేడక నాన్నగారి స్వస్థలమైన నిమ్మకూరులో అనుకున్నాం. వాతావరణం సహకరించలేదు. ఈ రోజు సినిమా లాంచింగా? ఆడియో, ట్రైలర్ లాంచింగా? అర్థం కావడం లేదు. చాలా త్వరగా పూర్తయింది. రెండు భాగాలుగా సినిమా వస్తోంది. ఎంతో మంది ఆర్టిస్టులు, ఇన్నో గెటప్పులు చేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించారు. ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూస్తున్న తరుణంలో శరవేగంగా పూర్తి చేశారు. ఈ సినిమాలో నటించడం పూర్వజన్మ సుకృతంగా భావించారు... అని చెప్పుకొచ్చారు.

  అది ఎవరి బిడ్డగానో పుడితే వచ్చేది కాదు

  అది ఎవరి బిడ్డగానో పుడితే వచ్చేది కాదు

  తల్లి నుంచి మనకు శారీరక, మానసిక శుచి, శుభ్రత, భావుకత వస్తుంది. తండ్రి నుంచి సంస్కారం, ధర్మ విచక్షణ, విజ్ఞానం వస్తుంది. మనం పుట్టిన వంశం నుంచి పరిపాలన దక్షత, సంస్కారం, అలాగే ఉదార స్వభావం... ఇలాంటివి వస్తాయి. కానీ ఐశ్వర్యం, పేరు వచ్చేది మాత్రం మన పూర్వజన్మ రుణాన్ని బట్టే వస్తుంది. అది ఎవరి బిడ్డగానో పుడితే వచ్చేది కాదు. నన్ను ఎవరైనా ఎవరి బిడ్డవని అడిగితే భారతీయుడిని అంటాను. మరోసారి ఎవరివని అడిగితే ఒక తెలుగు వాడిని అంటాను. ఇంకోసారి అడిగితే నందమూరి తారకరామారావుగారి కొడుకును అంటాను. మళ్లీ అడిగితే అన్నగారి అభిమానిని అంటాను. ఆ మహానుభావుడికి సాటిలేరు ఎవరు. ఈ రోజు ఆయన వారసుడిగా మీ ముందుకు రావడం పూర్వజన్మ సుకృతం.

  అది అబద్దమని నిరూపించింది ఇద్దరే

  అది అబద్దమని నిరూపించింది ఇద్దరే

  ఇది వరకు సినిమాలో చెప్పాను.. చరిత్ర సృష్టించేది మేమే... దాన్ని తిరగరాయాలన్నా మేమే. కానీ ఇపుడు చెబుతున్నాను చరిత్ర సృష్టించబోతున్నాం కానీ దాన్ని రిపీట్ చేయలేము. చరిత్ర అనేది మనం సృష్టించేది కాదు.. చరిత్ర మనల్ని సృష్టిస్తుంది అనేదాన్ని పచ్చి అబద్దం అని నిరూపించింది ఇద్దరే. ఒకటి ప్రాచీన ఆంధ్ర చరిత్ర సృష్టికర్త గౌతమీ పుత్ర శాతకర్ణి. ఆధునిక ఆంధ్ర చరిత్ర సృష్టికర్త నందమూరి తారక రామారావుగారు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.

   బాలకృష్ణకు పిచ్చో, పైత్యమో అనుకోవచ్చు

  బాలకృష్ణకు పిచ్చో, పైత్యమో అనుకోవచ్చు

  నాన్నగారు చేయలేని పాత్రలు నారదుడు, గౌతమీ పుత్రశాతకర్ణి చేశాను అని గొప్పగా చెప్పుకునేవాడిని. అదే నాన్నగారి పాత్ర నేను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆయనపై సినిమా తీయాలంటే రెండు భాగాలు కూడా సరిపోవు. ఎన్నో గెటప్పులు. అదేదో బాలకృష్ణకు పౌరాణికాలంటే పిచ్చో, పైత్యమో అనుకోవచ్చు. కొంతమంది ఇలాంటి వార్తలు తీసుకురావొచ్చు. ఈ సినిమాలో నాన్నగారి జీవిత సారాంశాన్ని తీసుకున్నాను. భావి తరాలకు దాన్ని ఎలా అందజేయాలి అనే కోణంలో ఆలోచించి సినిమా తీశామని బాలయ్య చెప్పుకొచ్చారు.

   నా తనువు పులకరిస్తుంది

  నా తనువు పులకరిస్తుంది

  నా సినిమా ఆడినా, ఆడక పోయినా ఓ విషయంలో గర్వంగా ఉంటుంది. నా సినిమా తెలుగు డైలాగులు విని చిన్న పిల్లాడు కూడా చెప్పగలుగుతున్నాడంటే అంతకంటే ఆనందం లేదు. తెలుగు అనే మూడు అక్షరాలు ఉంటే నా రక్తం ఉప్పొంగుతుంది. అలాగే ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది.

   తెలుగువాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరం ఉంది

  తెలుగువాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరం ఉంది

  రాజకీయంగా... ఆయన రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, యావత్ భారత దేశం గుర్తుంచుకునే మనిషి. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్ చేయడం జరుగుతుంది. తెలుగువాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరం ఉంది. ఇదంతా మేము కావాలని చేయలేదు. అలా రాసిపెట్టుంది. ఈ సినిమా ద్వారా ఎన్నో పాత్రలకు సంబంధించి నా కోరికలు తీరాయి.

  మా కుటుంబ సభ్యుల ఆమోదంతో

  ఈ సినిమా కుటుంబ సభ్యుల ఆమోదంతో చేశాను. ఇందులో ఏం చూపిస్తున్నానో చెప్పి, వారి సమ్మతి తీసుకుని చేయడం జరిగిందని బాలయ్య తెలిపారు.

  ఆమె మాకు దొరకడం అదృష్టం

  ఆమె మాకు దొరకడం అదృష్టం

  విద్యాబాలన్ మా అమ్మగారి పాత్ర వేశారు. ఆమె ఎలా చేసిందో రేపు సినిమాలో చూస్తారు. ఈ పాత్ర చేసినందుకు ఎంతో అనుభూతి చెందానని ఆమె చెప్పారు. ఆమె ఈ పాత్ర చేసినందుకు ఆమెకు మేము థాంక్స్ చెప్పాలి. మా అమ్మగారి పాత్ర చేయడం అదృష్టం అని ఆవిడ అంటే... ఆవిడ మాకు దొరకడం మా అదృష్టం అని నేను అంటాను.. ఇందులో ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి. కీరవాణి గారు ఈ సినిమాకు అందించిన సంగీతం అద్భుతంగా ఉందని బాలయ్య చెపుకొచ్చారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం, దర్శకుడు క్రిష్, నిర్మాతలపై బాలయ్య ప్రశంసల వర్షం కురిపించారు.

  English summary
  Balakrishna Speech at NTR Biopic Audio Launch. The audio and trailer launch event of ‘NTR’ biopic is held on December 21st at JRC Convention in Filmnagar, Hyderabad. Starring Nandamuri Balakrishna, Vidya Balan in the lead roles, the film is being directed by Krish Jagarlamudi. MM Keeravani has composed music.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X