»   » బాలకృష్ణ ‘శ్రీరామ రాజ్యం’ ఎప్పుడంటే...?

బాలకృష్ణ ‘శ్రీరామ రాజ్యం’ ఎప్పుడంటే...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ శ్రీరాముడుగా, నయనతార సీతాదేవిగా ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ప్రధాన తారాగణమంతా పాల్గొనే సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు వాల్మికిగా నటిస్తున్నారు. కాగా శ్రీరాముడి పాత్ర పోషణ కోసం బాలకృష్ణ, లక్ష్మణుడి పాత్ర పోషణ కోసం శ్రీకాంత్ మీసాలు కూడా తొలగించుకున్నారు.

ఇదిలా ఉంచితే, యలమంచిలి సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్ 10 న రిలీజ్ చేయాలని మొదట్లో భావించారు. అందుకు అనుగుణంగా నిర్మాణ కార్యక్రమాలను ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఇటీవల జరిగిన కార్మికుల సమ్మె కారణంగా షూటింగుకి చాలా అంతరాయం కలిగింది. ఎంత వేగంగా షూటింగ్ జరిపినా ఇక ఇప్పుడు ఆ రోజుకి రిలీజ్ చేయడం సాద్యం కాదనీ, ఇక ఆగష్టులో రిలీజ్ ఉంటుందనీ తెలుస్తోంది.

English summary
Nandamuri Bala Krishna’s mythological movie Sri Rama Rajyam may get delayed.The movie is expected to release in the first week of june.As the industry has been in strike for more than 10 days last month made the movie push little forward.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu