»   » ఈ వయసులోనూ స్టైలిష్‌గా బాలయ్య హల్‌చల్ (ఫోటోలు)

ఈ వయసులోనూ స్టైలిష్‌గా బాలయ్య హల్‌చల్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వయసు 53, అయినా కుర్ర హీరోలతో పోటీ పడే ఉత్సాహం, హీరోయిన్లతో అలుపు లేకుండా స్టెప్పేలేసే చురుకుదనం, పవర్ ఫుల్ డైలాగులతో థియేటర్లను దడదడలాడించే ఆవేశం, అబ్బా ఏమున్నాడ్రా...అనేలా స్టైలిష్ లుక్. ఇదీ తాజాగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'లెజెండ్' గురించి బ్రీఫ్‌గా చెప్పాలంటే...

బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన 'లెజెండ్' చిత్రం ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదలవుతోంది. సింహా తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్, పోస్టర్లు కూడా సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా చేసారు.

ఇందుకు తగిన విధంగానే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు......

లెజెండ్

లెజెండ్

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెజెండ్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు ‘A' సర్టిఫికెట్ జారీ చేసారు.

హై ఓల్టేజ్ స్టోరీ

హై ఓల్టేజ్ స్టోరీ

అయితే కథా పరంగా ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం. అందు వల్ల కొన్ని సీన్ల విషయంలో రాజీపడలేని పరిస్థితి. ఈ చిత్రానికి ‘A' సర్టిఫికెట్ వస్తుందని తాము ముందే ఊహించామని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

పొలిటికల్ డైలాగ్స్

పొలిటికల్ డైలాగ్స్

ఎన్నికల వేళ.....సినిమాలో కొన్ని పొలిటికల్ డైలాగులు ఉండటం వల్ల సర్టిఫికెట్ పొందే విషక్ష్ంలో నిర్మాతల కాస్త ఇబ్బంది పడ్డారు. సెన్సార్ బోర్డుతో పాటు ఎన్నికల కమీషన్ పర్మీషన్ కూడా పొందాల్సి వచ్చింది.

గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

‘లెజెండ్' చిత్రం ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంస్థ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బోయపాటి దర్శకత్వం

బోయపాటి దర్శకత్వం

గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘సింహా' లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన నేపథ్యంలో ‘లెజెండ్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

హీరోయిన్లు

హీరోయిన్లు

ఈ చిత్రంలో బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. రాధిక ఆప్టేతో పాటు, సోనాల్ చౌహాన్ ఇందులో బాలయ్యకు జోడీగా నటించారు.

జగపతి బాబు విలన్

జగపతి బాబు విలన్

ఈ చిత్రం ద్వారా జగపతి బాబు విలన్ అవతారం ఎత్తారు. ఇప్పటి వరకు వెండి తెరపై హీరోగా రాణించిన జగపతి....ఈ చిత్రంలో భయంకరమైన విలన్ పాత్రలో దర్శనమివ్వబోతున్నారు.

English summary
Nandamuri Balakrishna's film "Legend" is all set to have a grand release worldwide on 28 March.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu