»   » అసలేం జరిగింది??? స్వయంగా బాలకృష్ణే గౌతమీపుత్ర శాతకర్ణి షూట్ జరగకుండా అడ్డుకున్నాడు

అసలేం జరిగింది??? స్వయంగా బాలకృష్ణే గౌతమీపుత్ర శాతకర్ణి షూట్ జరగకుండా అడ్డుకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' షూటింగ్ ఆగిపోయింది. బాలయ్యే స్వయంగా షూటింగ్ ఆపించాడు. బాలయ్య అభిమానులు ఎంతో ఆతురతో ఎదురుచూస్తున్న సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నొ అశ్రమలకోర్చి తీస్తున్న సినిమా షూటింగ్ ని ఎందుకు ఆపారూ..? అసలేం జరుగుతోందీ యూనిట్ సభ్యులకు అర్థం కాలేదట... ఇంతకీ అసకు సంగతేంటంటే.... ఈ మధ్యే ఈ సినిమా డైరెక్టర్ క్రిష్పెళ్లి ఫిక్సయిన సంగతి తెలిసిందే.

ఆగస్టు 8న హైదరాబాద్‌కు డాక్టర్ రమ్యను క్రిష్ పెళ్లాడబోతున్నాడు. గత నెలలోనే నిశ్చితార్థం కూడా జరిగింది. అదవ్వగానే 'శాతకర్ణి' కొత్త షెడ్యూల్ కోసం జార్జియాకు బయల్దేరిపోయాడు క్రిష్. ఐతే పెళ్లి డేటు దగ్గరపడుతున్నా క్రిష్ ఇంకా సినిమా పనుల్లోనే బిజీగా ఉంటుండటంతో బాలయ్యే జోక్యం చేసుకున్నాడట.

 Balakrishna stopped Gautami Putra Satakarni Shooting

షూటింగ్ కాస్త ముందే ఆపించి.. క్రిష్ కు పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడానికి బ్రేక్ ఇచ్చాడట. ఒకట్రెండు రోజుల్లో క్రిష్ జార్జియా నుంచి హైదరాబాద్‌కు రాబోతున్నాడు. జార్జియా షెడ్యూల్లో క్లైమాక్స్ సన్నివేశాల్ని చిత్రీకరించారు. వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులతో.. వందల సంఖ్యలో గుర్రాలతో భారీ స్థాయిలో ఈ సన్నివేశాలు తీశారు.

క్రిష్ పెళ్లయ్యాక కొన్ని రోజులు మాత్రమే విరామం తీసుకుని.. ఆ తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. బాలయ్య సరసన శ్రియ నటిస్తున్నవిషయం తెలిసిందే! అంతేకాదు అందాల తార హేమమాలిని కబీర్ బేడి లాంటి హాలీవుడ్ యాక్టర్‌ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం జార్జియా షెడ్యూల్లో క్లైమాక్స్ సన్నివేశాల్ని చిత్రీకరించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

English summary
Reason Behind Balakrishna Stopped Gautami Putra Satakarni Shooting
Please Wait while comments are loading...