»   » బాలయ్య కోసం ప్రత్యేకంగా...., లుక్ అదిరిపోవాలంతే!

బాలయ్య కోసం ప్రత్యేకంగా...., లుక్ అదిరిపోవాలంతే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్' సినిమా చివరి దశకు చేరుకుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలయ్య గత సినిమాలకు భిన్నంగా మోస్ట్ స్టైలిష్ గా కనిపించబోతున్నారు.

ఫస్ట్ లుక్ కోసం బాలయ్యను ప్రత్యేకంగా మేకోవర్ చేసారు. ఇందుకోసం ఈరోస్ సంస్థ ఇండియాలోనే టాప్ స్టైలిస్ట్స్, డిజైనర్లను ప్రత్యేకంగా పిలిపించారు. దర్శకుడు శ్రీవాస్ బాలయ్య లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారట. బాలయ్య లుక్ సూపర్బ్ గా ఉండబోతోంది.

ఈ చిత్రంలో అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను జనవరి 14 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. రీసెంట్ గా బాలకృష్ణపై హైదరాబాద్ లో ఇంట్రడక్షన్ సాంగ్ తీసారు. ఈ చిత్రంలో బాలకృష్ణని శ్రీవాస్‌ సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారని, ఆయన గెటప్‌ వినూత్నంగా ఉండబోతోందని, ఆయన పలికే సంభాషణలు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచబోతున్నాయని చిత్ర దర్శకుడు చెప్తున్నారు.

Balakrishna stylish look in ‘Dictator’

తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్‌, రవికిషన్‌, కబీర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు.

ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Latest reports reveal that Balakrishna will be seen in a stylish look in ‘Dictator’. Noted production house, Eros Now has roped in some top stylists from all over India to design Balayya’s look in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu