»   » షూటింగ్ నా కాలు కాలినా పట్టించుకోకుండా... బాలకృష్ణ

షూటింగ్ నా కాలు కాలినా పట్టించుకోకుండా... బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మా నాన్నగారికి కన్నబిడ్డల కన్నా 24 శాఖల్లోని వారితోనే సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది.నన్నెప్పుడూ గారం చేసేవారు కాదు. ఓసారి ఆయన దర్శకత్వం చేస్తుండగా షూటింగ్‌లో నా కాలు కాలింది. అయినా పట్టించుకోకుండా నెక్స్ట్ షాట్‌కు వెళ్ళిపోయారు. అలా పరోక్షంగా నాలో ధైర్యం, ఆత్మవిశ్వాసాలను నేర్పించేవారు అంటూ నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో ఉన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ యు.వినాయకరావు నందమూరి తారకరామారావు గురించి రాసిన 'యుగానికి ఒక్కడు' పుస్తకాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో కృష్ణంరాజు బుధవారం రాత్రి ఆవిష్కరించారు. బాలకృష్ణ తొలి ప్రతిని అందుకున్నారు. సీనియర్ పాత్రికేయులు బి.ఎ.రాజు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.

అలాగే...చాలా మంది పుడతారు, గిడతారు. మహానుభావులు కాలేరు. తెలుగు జాతికి కీర్తిని తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన బిడ్డగా పుట్టడం నా పూర్వజన్మ ఫలితం. రాజకీయాల్లోకి రావడానికి తెలివితేటలు, వెసులుబాటుతనం కావాలని అందరూ అంటున్న రోజుల్లో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ ముందుకొచ్చారు అన్నగారు.ఈ గడ్డ మీద పుట్టిన ఎంతోమంది పేర్లను మర్చిపోతున్నాం. కానీ తెలుగుజాతి ఉన్నంతవరకూ ఆయన్ని కొనియాడుతారు. ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి, ఒక ఆవేశం..అలాగే ఆయనకు ఆయనకు భారతరత్న రావాలి అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu