»   » కళ్యాణ్ రామ్ ఎదురు ప్రశ్నించేవాడు....బాలకృష్ణ

కళ్యాణ్ రామ్ ఎదురు ప్రశ్నించేవాడు....బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాల గోపాలుడు సినిమాలో కళ్యాణ్ ‌రామ్ బాలనటుడిగా చేశాడు. ఆ సినిమా షూటింగ్ ‌లో దర్శకుడు వన్ మోర్ టేక్ అంటే...ఎందుకు రెండో టేక్. బాగానే చేశాగా అని ఎదురు ప్రశ్నించేవాడు. తప్పురా...అలా అడగకూడదు. డెరైక్టర్ ఎన్నిసార్లు చేయమంటే అన్నిసార్లు చేయడం నటుల ధర్మం అని ఆ రోజుల్లో వాడికి నచ్చచెప్పాను. ఆ సినిమా సమయంలోనే కళ్యాణ్ ‌లో ఫైర్ చూశా అంటున్నారు బాలకృష్ణ. ఆయన కళ్యాణ్ ‌రామ్ కత్తి చిత్రం ఆడియో విజయోత్సవంలో అతిథిగా పాల్గొని బాలకృష్ణపై విధంగా స్పందించారు. సినిమా రంగానికి చెందిన అన్ని శాఖల్లో పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి మా అబ్బాయి కళ్యాణ్ ‌రామ్. తాను ఎంతో శ్రమించి నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి, నటుడిగా అతణ్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. ఇక మణిశర్మ ఎప్పుడూ మంచి సంగీతాన్నే ఇస్తారు. ఇందులో పాటలన్నీ బాగున్నాయి. ఇవాళ్టి ప్రేక్షకుడికి సినిమా సాధనంగా మారింది. మల్లి మంచి దర్శకుడు. అతను మంచి నిర్మాత చేతిలో పడ్డాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని నందమూరి బాలకృష్ణ అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu