»   » ప్రవాసాంధ్రుల దాతృత్వానికి పులకించిన నటసింహ బాలకృష్ణ ...!

ప్రవాసాంధ్రుల దాతృత్వానికి పులకించిన నటసింహ బాలకృష్ణ ...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రవాసాంధ్రులు చూపిన ఆదరణ, దాతృత్వం మరువలేనివని నందమూరి బాలకృష్ణ అన్నారు. తన అమెరికా పర్యటన చివరి మజిలీ అయిన న్యూయార్క్ నగరంలో అభిమానులు విశేష ఆదరణ చూపారు. వారి అభిమానానికీ, ఆదరణకూ బాలకృష్ణ పులకించిపోయారు. కన్నతల్లిలాంటి స్వదేశానికి వారు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి నిధుల సేకరణకు న్యూయార్క్ లో విశేష స్పందన లభించింది.

ఆయన పర్యటించిన అన్ని నగరాలలోకీ ఈ నగరంలోనే దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. సుమారు కోటి రూపాయలకు పైగా న్యూయార్క్ ప్రవాసాంధ్రులు విరాళాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం బాలయ్య తన అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. అభిమానులు ఆయనకు ఘనమైన వీడ్కోలు ఇచ్చారు.

బాపు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా రూపుదిద్దుకొంటున్న 'శ్రీ రామరాజ్యం" చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకొని సెప్టెంబరులో విడుదలకు సిద్దమవుతుంది. శ్రీ రామరాజ్యం" చిత్రం బాపు దర్శకత్వంలో.యలమంచిలి సాయిబాబు నిర్మాణ సారధ్యంలో ,ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతంతో రూపుదిద్దుకొంది.

English summary
Balakrishna at TANA Conference: Great news for all the Nandamuri fans as Natasimha Nandamuri Balakrishna attend. Telugu Association of North America (TANA) Conference held at San Francisco, California.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu