»   » సౌఖ్యం: బాలయ్య చీఫ్ గెస్టుగా హాజరవుతున్నారు

సౌఖ్యం: బాలయ్య చీఫ్ గెస్టుగా హాజరవుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గోపీచంద్ హీరోగా, రెజీనా హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ''సౌఖ్యం'' . భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని, ఎ.ఎస్‌.ర‌వికుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు మినహా టాకీ పూర్తయ్యింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 13న ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్టుగా హాజరువుతున్నట్లు తెలుస్తోంది.

నలుగురి క్షేమం కోరే వ్యక్తిగా, నలుగురి సౌఖ్యం కోసం ఏం చేయడానికైనా వెనకాడని వ్యక్తిగా గోపీచంద్ నటిస్తున్నారు. గోపీచంద్ కెరీర్ ఆరంభంలో 'యజ్ఞం' వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.


Balakrishna to launch Soukyam audio

ద‌ర్శ‌కుడు ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి మాట్లాడుతూ - ''ఎదుటివారి క్షేమ‌స‌మాచారాల‌ను క‌నుక్కోవ‌డం మ‌న‌కున్న సంస్కారం. అలాంటి సంస్కారం తెలిసిన యువకుడు త‌న వారి సౌఖ్యం కోసం, త‌న చుట్టూ ఉన్న వారి సౌఖ్యం కోసం యాక్షన్ నే చేశాడా? ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోనే కొన‌సాగాడా? అనేది ఈ సినిమాలో ప్రధానాంశం. గోపీచంద్‌, రెజీనా జంట చూడ్డానికి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప‌దేళ్ళ త‌ర్వాత గోపీచంద్‌తో మ‌ర‌లా ప‌నిచేస్తుంటే ఒక‌ర‌క‌మైన ఉత్సాహంగా ఉంది'' అని చెప్పారు.


Balakrishna to launch Soukyam audio

గోపీచంద్‌, రెజీనా జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో షావుకారు జాన‌కి, బ్ర‌హ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, జీవా, ర‌ఘుబాబు, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, ర‌ఘు, శివాజీరాజా, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, స‌త్యం రాజేష్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు; శ‌్రీధ‌ర్ సీపాన‌, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌, ఎడిట‌ర్‌: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్‌, నిర్మాత‌: వి.ఆనంద్‌ప్ర‌సాద్‌.

English summary
Gopichand’s upcoming film, Soukhyam will have its audio launch in Ongole on 13th of December. Latest update reveals that Nandamuri Balakrishna will be the chief guest for this event.
Please Wait while comments are loading...