Don't Miss!
- Lifestyle
Chanakya Niti: మహిళలు ఈ విషయాలను ఎప్పటికీ ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- News
ఆధ్యాత్మిక వేడుక సమతా కుంభ్ 2023 నేటి నుండే.. షెడ్యూల్ ఇదే.. నేటి విశేషాలేంటంటే!!
- Finance
Citi Group: అదానీకి మరిన్ని కష్టాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న సిటీ గ్రూప్.. ఢమాల్..
- Technology
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- Sports
INDvsNZ : జట్టులో వేస్ట్ అన్న వాళ్లకు.. సెంచరీతో బదులిచ్చిన గిల్.. ఏమన్నాడంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Balakrishna: పాన్ ఇండియా మూవీకి బాలకృష్ణ మద్దతు.. ఊరమాస్ లుక్‌తో రంగంలోకి!
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల గర్జించిన చిత్రం వీర సింహా రెడ్డి. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి బరిలోకి దిగి సాలిడ్ హీట్ కొట్టింది. స్టార్ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమాలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసి అదరగొట్టాడు. మరోసారి బాలయ్య బాబు తన నట విశ్వరూపం చూపించారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య బాబు ఓ యంగ్ హీరోకు మద్దతుగా నిలిచేందుకు రంగంలోకి దిగాడు. ఆ వివరాల్లోకి వెళితే..

కీలక పాత్రలో విజయ్ సేతుపతి..
హిట్స్, ఫ్లాప్స్ పట్టించుకోకుండా విభిన్న సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం ఈ హీరో ఆయన కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమానే మైఖేల్. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడిగా దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో సందీప్ కిషన్ చేసిన లిప్ లాక్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఫిబ్రవరి 3న రిలీజ్..
రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్నడూ కనపించని విధంగా సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకోనున్నాడు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ బాగానే నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ భరద్వాజ్ పోస్టర్స్ విడుల చేశారు. అలాగే మైఖేల్ మూవీ టీజర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నారు.

రంగంలోకి వీర సింహా రెడ్డి..
మైఖేల్ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇందులో భాగంగానే జనవరి 23న అంటే సోమవారం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఇందుకోసం నందమూరి నటసింహం బాలకృష్ణ హాజరు కానున్నారు. ఆయన చేతుల మీదుగా మైఖేల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తాజాగా ఒక పోస్టర్ విడుదల చేశారు. వీర సింహా రెడ్డి సినిమాలో ఊరమాస్ గా చుట్ట వెలిగిస్తున్న బాలయ్య బాబు ఫొటోను చిత్ర బృందం షేర్ చేసింది. ఇదిలా ఉంటే యంగ్ హీరోల ఈవెంట్స్ కు బాలయ్య వెళ్లడం చాలా అరుదు. గతేడాది మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ధమ్కీ ట్రైలర్ లాంచ్ చేసిన బాలయ్య సరదాగా మాట్లాడారు. మళ్లీ ఇప్పుడు సందీప్ కిషన్ కోసం రంగంలోకి దిగారు బాలయ్య బాబు. కాగా సందీప్ కిషన్ మరో మూడు సినిమాలతో బిజీగా ఉంటే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు.
#MichaelTrailer Launch on Jan 23rd😎
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 21, 2023
With the Blessings of God of Masses #NandamuriBalakrishna garu ❤️#Michael#MichaelFromFEB3rd @sundeepkishan @VijaySethuOffl @Divyanshaaaaaa @jeranjit @menongautham @anusuyakhasba @SamCSmusic @SVCLLP @KaranCoffl @adityamusic pic.twitter.com/aZ7VncQySS