»   » రాజమౌళి దర్శకత్వంలో బాలకృష్ణ

రాజమౌళి దర్శకత్వంలో బాలకృష్ణ

Posted By: Super Admin
Subscribe to Filmibeat Telugu

జూనియర్ ఎన్టీ ఆర్ తో ప్రయోగాలు చేసి విజయం సాధించిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ సంవత్సరంలోనే నందమూరి బాలకృష్ణ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. తనదైన శైలిలో సినిమాలను విజయంవంతంగా మలుచుతున్న రాజమౌళి ప్రస్తుతం స్టార్ దర్శకుడు.

రాజమౌళి ప్రస్తుతం చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా ఎటూ ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య బాబుకు రాజమౌళి దర్శకత్వ భాగ్యం లభించనుంది. రాజమౌళి- బాలకృష్ణల సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చనున్నారు. అప్పటికి బాలకృష్ణ తన పాండురంగడు సినిమాను, గుణశేఖర్ దర్శకత్వంలో "సాధు" సినిమాను పూర్తి చేసుకుంటారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X