»   » బాలయ్య, దాసరిల చిరస్థాయిగా నిలిచే చారిత్రాత్మక చిత్రం...

బాలయ్య, దాసరిల చిరస్థాయిగా నిలిచే చారిత్రాత్మక చిత్రం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువరత్న బాలకృష్ణ 'సింహా" చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి దిగ్విజయం సాధించి ద్విగుణీకృత ఉత్సాహంతో వున్నాడు. అందే సంతోషంలో తన తాజా చిత్రం 'పరమవీర చక్ర" లోనూ మరోసారి డ్యూయెల్ రోల్ చేయనున్నరన్నది నటసింహా ఫ్యాన్స్ కి బాలయ్య బర్త్ డే సందర్భంగా దట్స్ తెలుగు అందిస్తున్న స్పెషల్ న్యూస్. ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో రూపొందునున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తోన్న దాసరి ఇందులో బాలయ్య చేసే రెండు పాత్రలనూ అద్భుతంగా మలిచారట.

బొబ్బిలిపులి, సర్థార్ పాపారాయుడు చిత్రాల్లోని నటరత్న ఎన్టీఆర్ పాత్రల స్పూర్తితో 'పరమవీర చక్ర" పొందే టైటిల్ రోల్ ని, బాలయ్య నుంచి అభిమనాులు ఆశించే అన్ని అంశాలతో మరో పాత్రనీ రాశారట దాసరి. తన 150 వ సినిమాని బాలయ్యతో 350రోజుల చిత్రంగా నిలుపుతానని చెబుతోన్న దర్శకరత్న ఆ మాటని నిజం చెయ్యగలిగితే అది చిరస్థాయిగా నిలిచే చారిత్రాత్మక విజయం అవుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu