»   »  అదిరిపోయే కాంబినేషన్: బాలకృష్ణ-వివి వినాయక్ మూవీ ఖరారు!

అదిరిపోయే కాంబినేషన్: బాలకృష్ణ-వివి వినాయక్ మూవీ ఖరారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు తెరపై మరో భారీ కాంబినేషన్ రూపుదిద్దుకుంటోంది. టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన బాలకృష్ణ, టాప్ డైరెక్టర్లలో ఒకరైన వివి వినాయక్ కలిసి సినిమా చేయబోతున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో 'చెన్నకేశ రెడ్డి' అనే సినిమా వచ్చింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వీరు మళ్లీ కలిసి సినిమా చేయబోతున్నారు.

బాలకృష్ణ-వివి వినాయక్ కాంబినేషన్లో రాబోయే సినిమాను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సికె ఎంటర్టెన్మెంట్ష్ బేనర్లో నిర్మించబోతున్నారు. మే 27న సినిమాను అఫీషియల్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్, ఇతర తారాగణం, టెక్నీషియన్స్ ఎంపిక జరుగాల్సి ఉంది.

Balakrishna, Vinayak new film details

సి.కళ్యాణ్ నిర్మించిన గత రెండు సినిమాల విషయానికొస్తే... ఆయన బాలయ్యతో నిర్మించిన 'జై సింహా' చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నిర్మించిన 'ఇంటిలిజెంట్' చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది.

తన దర్శకత్వంలో వచ్చిన 'ఇంటిలిజెంట్' మూవీ సరిగా ఆడనందు వల్ల నిర్మాతకు మేలు చేసేందుకు ఆయనతో మరో సినిమా చేయడానికి వినాయక్ ఓకే చెప్పారని, అలా బాలయ్యతో సినిమా సెట్టయిందని అంటున్నారు.

English summary
Film Nagar source said that, Balakrishna and Vinayak will be joining hands for the second time after Chennakesava Reddy. The movie will be launched officially on May 27th and the regular shoot of the film will follow.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X