»   » 'మా' అవార్డు ఉత్తమ నటుడుగా బాలకృష్ణ-ఉత్తమ నటి కాజల్

'మా' అవార్డు ఉత్తమ నటుడుగా బాలకృష్ణ-ఉత్తమ నటి కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'సింహా' చిత్రంలోని అభినయానికి గాను బాలకృష్ణ ఉత్తమ నటుడిగా మాటీవీ నిర్వహించిన లక్స్ శాండిల్ సినిమా అవార్డ్ అందుకున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాదు మాదాపూర్ లోని హెచ్ఐసిసి ప్రాంగణంలో కన్నుల పండువగా జరిగిన వేడుకలో ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ చేతుల మీదుగా ఆయనీ అవార్డు స్వీకరించారు. ఉత్తమ నటిగా 'బృందావనం' సినిమాకు గాను కాజల్ అగర్వాల్ తరఫున ఆమె సోదరి నిషా అగర్వాల్ అవార్డు అందుకుంది.

ప్రముఖ గాయకుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రంగా 'మర్యాద రామన్న', ఉత్తమ దర్శకుడుగా గౌతమ్ మీనన్ (ఏ మాయ చేశావే), ఉత్తమ సంగీత దర్శకుడుగా ఎఆర్ రెహమాన్ (ఏ మాయ చేశావే), ఉత్తమ హాస్యనటుడుగా బ్రహ్మానందం (అదుర్స్) అవార్డులు స్వీకరించారు. అల్లు అర్జున్, ప్రియమణి, విమలా రామన్, చార్మి తదితరులు పలు సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు.

English summary
Lux Sandal Cinema Awards 2011 were presented by MAA TV today evening at a function organized in Hotel Novotel tonight. It was attended by loads of film celebrities. Allu Arjun and Kamal Kamaraju walked on the ramp where as actresses like Priyamani, Charmi and Vimala Raman performed to film songs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu